
40 ఏళ్లు వచ్చేలోపు ఎవరి దగ్గరైన సరే 6 నుంచి 12 నెలలకు సరిపడా ఖర్చులకు ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే, ఏ సమయంలో ఐనా ఏమైనా జరగొచ్చు. ఇంకా ఉద్యోగం కోల్పోవడం, అత్యవసర పరిస్థితులు అలాగే ఆర్థికంగా సమస్యలు ఎదురుకావడం వంటివి వస్తాయి. అంతే కాదు, నెలకు రూ.80,000 ఖర్చు చేసే రూ.4.8 లక్షల నుంచి రూ.9.6 లక్షల వరకు పెట్టుకోవాలి.

అలాగే జీవిత బీమా, ఆరోగ్య బీమాను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆదాయం, ఆరోగ్యం, కుటుంబ భవిష్యత్తుకు సరైన బీమా కూడా అవసరం. అంతేకాదు, ఊహించని వైద్య ఖర్చులు వస్తాయి అప్పుడు పొదుపు చేసినవి అవసరమవుతాయి. అప్పుడు ఈ బీమా కాపాడుతుంది.

మీరు క్రెడిట్ కార్డులు బాగా వాడుతున్నట్లయితే వీటిని చాలా తగ్గించుకోవాలి. ఇంకా అధిక వడ్డీ వ్యక్తిగత రుణాలు వంటి ఖరీదైన అప్పులను కూడా మీరు చాలా తగ్గించుకుంటే మంచిది. అధిక వడ్డీలు మిమ్మల్ని తెలియకుండానే మింగేస్తాయి. అప్పులను తగ్గించుకోండి అవసరం ఉంటే తప్ప తీసుకోకండి

కేవలం మీరు నెలవారీ జీతంపై మాత్రమే ఆధారపడకుండా ఇంకా మీరు కొన్ని వాటిలో పెట్టుబడులు, పొదుపులు, అద్దె ఆదాయం ఇవే కాకుండా ఇతర ఆస్తులను కూడా మీరు పెంచుకోవచ్చు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సర్టిఫికేషన్లు నుంచి కూడా మీరు భవిష్యత్తులో సంపాదన పెంచుకోవచ్చు.

40 ఏళ్ల వయసులో జీతం ఒక్కటే మీ ఆర్థిక భద్రతకు అసలు హామీ కానే కాదు. మీ జీతం నుంచి కొంతమేరకు పెట్టుబడులు, సరైన బీమా, అప్పులు తగ్గించుకోవడం, క్రమబద్ధమైన పొదుపు, స్థిరమైన వ్యాపారాలే మిమ్మల్ని నిలబెడుతాయి కాబట్టి మీరు కూడా వీటిని ఫాలో అయ్యి ఆర్థిక సమస్యల నుంచి బయట పడండి.