వన భోజనాల్లో 4 కేజీల మటన్ ను ఇలా వండితే 50 మందికి పెట్టొచ్చు.. ముక్కలు కూడా మెత్తగా

Updated on: Nov 28, 2026 | 1:30 PM

వన భోజనాల్లో 50 మందికి మటన్ కూర చేయాలంటే మటన్‌తో పాటు మసాలాలు కావాల్సిన పదార్థాలు సరైన విధంగా తీసుకోవాలి. ముఖ్యంగా మటన్ ముక్కలకు మసాలాలు బాగా పడితే పులుసు అన్నంలో కలుపుకుని తినడానికి మంచి టేస్టీగా ఉంటుంది. వన భోజనాల్లో 4 కేజీల మటన్‌తో ఇలా చేస్తే 50 మందికి సరిపోతోంది.

1 / 5
50 మందికి మటన్ కూర చేయాలంటే మటన్‌తో పాటు మసాలాలు కావాల్సిన పదార్థాలు సరైన విధంగా తీసుకోవాలి. ముఖ్యంగా మటన్ ముక్కలకు మసాలాలు బాగా పడితే పులుసు అన్నంలో కలుపుకుని తినడానికి మంచి టేస్టీగా ఉంటుంది. వన భోజనాల్లో  4 కేజీల మటన్‌తో ఇలా చేస్తే  50 మందికి సరిపోతోంది.

2 / 5
కావాల్సిన పదార్థాలు : 4 కేజీల మటన్, 2 కేజీల ఉల్లిపాయలు,  150 గ్రాముల కారం, 150 గ్రాముల ధనియాల పొడి, 30 గ్రాముల పసుపు, 50 గ్రాముల గరం మసాలా,  1 కేజీ టమాటాలు,  పచ్చిమిర్చి, రెండు పాకెట్స్  అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 మటన్ మసాలా పాకెట్స్, 500 గ్రాముల పెరుగు,  1 కేజీ నూనె, 3 కట్టల పుదీనా, 4 కట్టల కొత్తిమీర, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, సరిపడినంత ఉప్పు తీసుకోవాలి.

3 / 5

ముందుగా 4 కేజీల మటన్‌ను తీసుకుని 3 సార్లు బాగా  కడిగి మటన్ ముక్కలు చిన్నగా  కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక  గిన్నెలో మటన్ ముక్కలు వేసి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, పెరుగు,  ఉప్పు  వేసి కలపాలి. ఇలా కలిపిన మటన్‌ను  గంట  పాటు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే మటన్‌కు మంచి రుచి వస్తుంది.

4 / 5
ఇప్పుడు పొయ్యి వెలిగించి పెద్ద గిన్నె తీసుకుని నూనె పోసి, నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తరవాత దీనిలో టమాటా ముక్కలు బాగా  ఉడికించాలి. ఇవి మెత్తగా అయ్యే వరకు చూడాలి.

5 / 5
ఇప్పుడు మటన్ ముక్కలను వేసి సన్నని  20 నిమిషాల పాటు కలపాలి. మటన్ నుంచి నీళ్లు వచ్చాక అడుగుకు అంటుకోకుండా  కలుపుతూ ఉండాలి. మళ్ళీ నీళ్లు పోసి మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.  ఉడికిన తర్వాత అందులో  మసాలాలు వేసి బాగా కలపాలి.  పుదీనా, కొత్తిమీర వేసి గ్రేవీగా అయ్యేవరకు ఉంచి దించుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us