
భోజనాల్లో ఇప్పుడు చెప్పుకోబోయే ఐటెం పక్కా ఉంటుంది వినాయక అన్నదానాల్లో ఇది ప్రత్యేకమైనది. అలాగే, మీ ఇంట్లో అతిథులు వచ్చి ఆతిథ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు కూడా ఇది మంచి ఎంపిక. 2000 మందికి పలావ్ రైస్ చాలా తక్కువ సమయంలో, అద్భుతమైన రుచితో భోజనం సిద్ధం చేయాలంటే పులావ్ సరైన ఎంపిక.

2000 మందికి పలావ్ రైస్ రెసిపీ కావాల్సిన పదార్థాలు: బియ్యం 150 కిలోలు, కూరగాయలు 50 కిలోలు, ఉల్లిపాయలు 30 కిలోలు, టమాటాలు 20 కిలోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 కిలోలు, పచ్చిమిర్చి 4 కిలోలు, కొత్తిమీర 5 కిలోలు, పుదీనా 4 కిలోలు, నూనె 18 లీటర్లు, నెయ్యి 4 లీటర్లు, రుచికి సరిపడా ఉప్పు, పలావ్ మసాలా, గరం మసాలా 2 కిలోలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు తీసుకోవాలి.

పులావ్ చేయడానికి బాస్మతి బియ్యం లేదా మనం రోజూ వాడే సాధారణ బియ్యాన్ని కూడా ఉపయోగించవచ్చు. ముందు బియ్యం తీసుకుని, నీటితో రెండు సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. బియ్యం నానబెట్టడం వల్ల పులావ్ పొడిపొడిలాడుతూ బాగా ఉడుకుతుంది. పాత బియ్యం అయితే గ్లాసుల నీళ్లు ఎక్కువ పోసి, కొత్త బియ్యం అయితే నీళ్లు కొద్దిగా తగ్గించి పోసుకోవాలి.

ఒక మందపాటి గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, ఒక అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ (బండ పువ్వు), షాజీరా వేసి దోరగా వేయించాలి. ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తరువాత, టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గే వరకు వేయించాలి.

టమాటాలు మగ్గిన తర్వాత, ముందుగా నానబెట్టుకున్న బియ్యం.. నానబెట్టిన నీళ్లతో సహా గిన్నెలో వేయాలి. అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. గరం మసాలా పొడి, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి నిదానంగా కలపాలి. రైస్ విరిగిపోకుండా చూసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, నీళ్లు కొద్దిగా ఉప్పగా అనిపించే వరకు కలపాలి. ఇలా చేయడం వల్ల పులావ్ ఉడికేసరికి ఉప్పు సరిగ్గా సరిపోతుంది. మూత పెట్టి, మధ్యస్థ మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి. సగం నీళ్లు ఇంకిపోయిన తర్వాత, మంటను తగ్గించి సిమ్‌లో పెట్టి పూర్తిగా ఉడికించాలి. రైస్ పొడిపొడిలాడుతూ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల మిగిలిన తేమను రైస్ పీల్చుకుని మరింత పొడిపొడిలాడుతుంది.