Onion Masala Gravy: రెండు ఉల్లిపాయలు ఉంటే చాలు  10 నిమిషాల్లో మసాలా గ్రేవీ కర్రీ రెడీ

Updated on: Oct 16, 2026 | 5:50 PM

వంటింట్లో కూరగాయలు అయిపోయినప్పుడు లేదా రాత్రి పూట చపాతీలు, పరోటాలు, బిర్యానీలోకి త్వరగా అయిపోయే కమ్మని సైడ్ డిష్ చేయాలనిపించినప్పుడు గుర్తొచ్చే అద్భుతమైన వంటకం ఉల్లిపాయ గ్రేవీ కర్రీ. సాధారణంగా ఉల్లిపాయతో కూర అంటే ముక్కలు కోసి వేపుడు చేస్తారు; కానీ రెస్టారెంట్ శైలిలో ఉల్లిపాయ ముక్కల క్రంచీనెస్‌తో పాటు చిక్కటి క్రీమీ గ్రేవీ రావడానికి ఒక చక్కని పద్ధతి ఉంది. 

1 / 5
కావలసిన పదార్థాలు: 2 ముక్కలుగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు,  1 సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ, 2  మెత్తటి ప్యూరీలా రుబ్బిన టమాటాలు ,  1 కప్పు తాజా కమ్మని పెరుగు, 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ , అర టీస్పూన్ జీలకర్ర ,  ఒకటిన్నర స్పూన్ కారం పొడి, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ గరం మసాలా పొడి, 1 టీస్పూన్ కసూరి మేథీ, రుచికి సరిపడా ఉప్పు, అర కప్పు నీళ్లు , కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, సరిపడా వంట నూనె

2 / 5
తయారీ విధానం: రెండు పెద్ద ఉల్లిపాయల తొక్క తీసి.. మరీ చిన్నగా కాకుండా గ్రేవీలో స్పష్టంగా కనిపించేలా కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి, ఈ ఉల్లిపాయ ముక్కలను వేయాలి. మీడియం మంటపై ముక్కలు కొద్దిగా రంగు మారి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
అదే కడాయిలో మరో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. ఇలాంటి రిచ్ గ్రేవీలకు నూనె కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌పై బాగా వేయించాలి. ఆ తర్వాత 2 టమాటాల ప్యూరీ, 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి టమాటా గుజ్జు సాఫ్ట్‌గా ఉడికే వరకు వేయించాలి.

4 / 5
టమాటాలు మగ్గిన తర్వాత మంటను సిమ్‌లో ఉంచి.. ఒకటిన్నర స్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ ధనియాల పొడి వేసి నూనెలో మసాలాల పచ్చివాసన పోయేలా వేయించాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచి 1 కప్పు తాజా కమ్మని పెరుగును వేసి ఉండలు లేకుండా గరిటెతో వేగంగా కలపాలి. గ్రేవీ పైకి నూనె తేలేంత వరకు సన్నటి సెగపై ఉడికించాలి.

5 / 5
నూనె తేలిన తర్వాత.. ముందుగా వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రేవీ ముక్కలకు పట్టేలా కలపాలి. ఒక నిమిషం మగ్గిన తర్వాత అర కప్పు నీళ్లు పోసి సెమీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. మూతపెట్టి లో ఫ్లేమ్‌పై నూనె పైకి తేలే వరకు 2 నుండి 3 నిమిషాలు ఉడికించాలి. చివరగా 1 టీస్పూన్ కసూరి మేథీని చేత్తో నలిపి వేసి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ 'ఉల్లిపాయ గ్రేవీ' సిద్ధం! వేడివేడి చపాతీ, లేయర్ పరోటా, ఫుల్కా, లేదా బిర్యానీ, కుష్కాల్లోకి నంజుకుని తింటుంటే అద్భుతమైన రుచితో అందరూ లొట్టలేసుకుంటూ తింటారు!

Loading...
Unable to load recommendations.
Follow Us