
నేటి జీవనశైలిలో ఎన్నో వ్యాధులు పెరుగుతున్నాయి ఇంకా వీటిని ముందుగా ఎలా గుర్తించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం NCD 4.0 అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. 2025 సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ 10తో ఈ సర్వే పూర్తయింది. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు అందరికి టెస్ట్ లు నిర్వహించారు.

18 ఏళ్లు పైబడిన వారిలో 2.85 కోట్ల మందికి బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్ టెస్ట్ లు నిర్వహించారు. 60 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువ కేసులు వచ్చాయి. ఇక వయస్సుల వారిగా చూస్తే 60 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం బీపీ బాధితుల్లో 47.60 శాతం, మధుమేహ బాధితుల్లో 43.39 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారే ఉన్నారని ఈ సర్వేలో తేలింది.

వయసులు వారిగా బీపీ బాధితులు, షుగర్ బాధితులు ఇలా ఉన్నారు. 18–19 ఏళ్లు 11,827 10,360, 20–29 ఏళ్లు 81,983 75,431, 30–39 ఏళ్లు 2,89,865 2,86,680, 40–49 ఏళ్లు 9,99,833 9,22,583, 50–59 ఏళ్లు 17,41,147 14,76,353, 60 ఏళ్లు పైబడినవారు 28,38,552 21,24,428

ఏయే ఏయే జిల్లాల్లో ఎక్కువ అంటే? NCD 4.0 సర్వేలో కొత్తగా గుర్తించిన బీపీ కేసుల్లో తిరుపతి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొత్త బీపీ కేసులు నమోదైన జిల్లాలు ఇవి. విశాఖపట్నం – 78,017, పశ్చిమగోదావరి – 68,802, తిరుపతి – 65,504, తూర్పుగోదావరి – 64,116, వైఎస్సార్ కడప – 63,141

ఇంకా కొత్త షుగర్ కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాలు ఇవే.. విశాఖపట్నం – 80,692, పశ్చిమగోదావరి – 67,935, తిరుపతి – 67,827, వైఎస్సార్ కడప – 66,914 , ప్రకాశం – 61,415 బాధితులకు ఉచిత వైద్యం అందివ్వనున్నారు. వ్యాధులకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. బీపీ, మధుమేహం వంటి సమస్యలను మొదటి దశలోనే గుర్తించి, వాటి తీవ్రత మరింత పెరగకుండా వైద్య సేవలు అందరికి అందిస్తున్నామని తెలిపారు.