తమ వీసాలపై హామీ ఇవ్వాలంటూ ఐసీసీని వేడుకున్న పాక్‌

వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఆడుతుందా లేదా? భారత్‌లో ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది పాకిస్తాన్‌... భారత్‌ మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది..

తమ వీసాలపై హామీ ఇవ్వాలంటూ ఐసీసీని వేడుకున్న పాక్‌
Follow us

|

Updated on: Oct 21, 2020 | 10:39 AM

వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఆడుతుందా లేదా? భారత్‌లో ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది పాకిస్తాన్‌… భారత్‌ మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది.. రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లన్నీ రద్దు అయ్యాయి.. ఐసీసీ టోర్నమెంట్లలోనే రెండు దేశాలు తలపడుతున్నాయి.. అయితే వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఇండియాలో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు తమకు వీసాలు మంజూరుపై హామీ ఇవ్వాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వసీం ఖాన్‌ ఐసీసీకి విన్నవించుకున్నాడు.. ఇప్పుడున్న పరిస్థితులలో తామేమీ ద్వైపాక్షిక సిరీస్‌ను ఆశించడం లేదని, ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నమెంట్‌లో ఆడే అవకాశం ఇవ్వాలని అన్నారు.. వరల్డ్‌కప్‌ అన్నది ఐసీసీకి సంబంధించిన విషయం కాబట్టి తమకు భారత్‌లో ఆడేందుకు వీసాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్‌లో పాల్గొనే అన్ని జట్లకు టోర్నమెంట్‌ను నిర్వహించే దేశమే వసతులు కల్పించాల్సి ఉంటుందని, పాకిస్తాన్‌ కూడా అందులో భాగమేనని వసీం ఖాన్‌ తెలిపారు. తమ ఆటగాళ్లకు వీసాలు వచ్చేలా ఐసీసీ హామీ ఇస్తుందని అనుకుంటున్నామన్నారు. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో ఐసీసీ మాట్లాడలని ఆయన కోరారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ముంబాయిపై ఉగ్రవాదుల దాడి తర్వాత అంటే 2008 తర్వాత భారత క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌లో అడుగు పెట్టలేదు. పాకిస్తాన్‌ మాత్రం మన దేశంలో జరిగిన టీ-20 సిరీస్‌లో పాల్గొన్నది..

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు