పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి మొబైల్ బ్యాంకింగ్ యాప్‌

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తాజాగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. దీని సాయంతో బ్యాంక్ అకౌంట్‌ను వేగంగా, సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు, డెబిట్ కార్డు రిక్వెస్ట్, డిజిటల్ డెబిట్ కార్డు యాక్సెస్ వంటి తదితర సేవలు సులభంగా లభిస్తాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు 2017లో ప్రారంభమయ్యాయి. బ్యాంక్‌కు ప్రస్తుతం 4.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. బ్యాంక్ ఇప్పటికే 20 లక్షలకు పైగా డెబిట్ కార్డులను జారీ చేసింది. అలాగే బ్యాంక్ […]

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి మొబైల్ బ్యాంకింగ్ యాప్‌
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 3:41 PM

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తాజాగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. దీని సాయంతో బ్యాంక్ అకౌంట్‌ను వేగంగా, సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు, డెబిట్ కార్డు రిక్వెస్ట్, డిజిటల్ డెబిట్ కార్డు యాక్సెస్ వంటి తదితర సేవలు సులభంగా లభిస్తాయి.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు 2017లో ప్రారంభమయ్యాయి. బ్యాంక్‌కు ప్రస్తుతం 4.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. బ్యాంక్ ఇప్పటికే 20 లక్షలకు పైగా డెబిట్ కార్డులను జారీ చేసింది. అలాగే బ్యాంక్ తన కస్టమర్లందరికీ వర్చువల్ డెబిట్ కార్డులను ఇష్యూ చేసింది.

మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ వల్ల 4.3 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుందని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సతీష్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌తో వారంలో ఏడు రోజులూ బ్యాంక్ సేవలు పొందొచ్చని పేర్కొన్నారు. కాగా పేటీఎం మొబైల్ బ్యాంకింగ్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సురక్షితంగా వినియోగదారులకు వారి పొదుపు ఖాతాలో ఒక లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేయటానికి అనుమతిస్తుంది. ఒక లక్ష రూపాయల పరిమితిని దాటిన మొత్తాన్ని ఆటోమేటిక్‍గా స్వీయ స్వీప్ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామి బ్యాంకుతో ఫిక్స్ డిపాజిట్‍గా మార్చడం జరుగుతుంది, ఇది తక్షణమే ఎప్పుడైనా ఉచితంగా రీడీమ్ చేయబడుతుంది.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!