Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

నాగబాబు ట్వీట్లపై ఘాటుగా స్పందించిన పవన్‌.. ఆ వ్యాఖ్యలతో..!

Naga Babu Controversial comments, నాగబాబు ట్వీట్లపై ఘాటుగా స్పందించిన పవన్‌.. ఆ వ్యాఖ్యలతో..!

మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చేస్తోన్న పలు ట్వీట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న గాడ్సేను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్లు చేయగా.. తాజాగా కరెన్సీ నోట్లపై ఆయన కామెంట్లు చేశారు. ముఖ్యంగా జాతిపిత గాంధీని టార్గెట్‌ చేసినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో.. కొందరు ఫైర్ అవుతున్నారు. నాగబాబు తన ప్రవర్తనను మార్చుకోవాలంటూ కొందరు రాజకీయ నేతలు కూడా మండిపడ్డారు. కాగా నాగబాబు వ్యాఖ్యలపై జనసేన అధినేత, ఆయన సోదరుడు పవన్‌ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేనకు సంబంధం లేదు అంటూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

”జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నా. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని మీకు తెలిపాం. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున మరోసారి ఆ విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాను. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికార పత్రం ద్వారా, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాము. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరికీ ఒక మాట చెబుతున్నా. ఇది ప్రజలు అనుకోని కష్టాలను ఎదుర్కొంటున్న కాలం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్ప మరేతర అంశాల జోలికి వెళ్లొద్దని కోరుతున్నా. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విఙ్ఞప్తి చేస్తున్నా” అని తన ప్రకటనలో పవన్ తెలిపారు. అయితే సొంత సోదరుడి వ్యాఖ్యలపై పవన్ ఘాటు కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

Read This Story Also: దశాబ్దంగా సాగుతున్న కేసును ఛేదించిన 6 ఏళ్ల బుడతడు..!

Related Tags