ఫిరాయింపుల నిషేధ చట్టం అంటే ?

ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు.. సుజనా చౌదరి, సీఎం. రమేష్, టీజీ. వెంకటేష్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎగువసభలో బీజేపీ బలం 75 కి పెరిగింది. మొదట రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయిన వీరు.. ఆ తరువాత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ. నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. టీడీపీ రాజ్యసభ లెజిస్లేచర్ పార్టీ కమలం పార్టీలో విలీనం కావడం నడ్డాకు పెద్ద విజయమేనని […]

ఫిరాయింపుల నిషేధ చట్టం అంటే ?
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 24, 2019 | 7:20 PM

ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు.. సుజనా చౌదరి, సీఎం. రమేష్, టీజీ. వెంకటేష్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎగువసభలో బీజేపీ బలం 75 కి పెరిగింది. మొదట రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయిన వీరు.. ఆ తరువాత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ. నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. టీడీపీ రాజ్యసభ లెజిస్లేచర్ పార్టీ కమలం పార్టీలో విలీనం కావడం నడ్డాకు పెద్ద విజయమేనని భావిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టిన సందర్భంలోనే జరిగిన ఈ పరిణామం ఆయనకు శుభ సూచికమే. ముఖ్యంగా ఈ నలుగురి విలీనం పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం పరిధిలోకి రాకపోవడం విశేషం. అసలు ఈ చట్టమంటే ఏమిటి ? 1985 కు ముందు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల్లోకి జంప్ చేయడంపై ఎలాంటి ఆంక్షలూ ఉండేవి కావు. ‘ ఆయా రామ్, గయా రామ్ ‘ ల జోరు అప్పట్లో విపరీతంగా ఉంటూ వచ్చింది. 1967 లో హర్యానాకు చెందిన గయాలాల్ అనే లెజిస్లేటర్ యునైటెడ్ ఫ్రంట్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయడం, ఆ వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్ గూటికి చేరడం అంతా .. ఒక్క రోజులో..కేవలం తొమ్మిది గంటల్లో జరిగిపోయింది. దీంతో రాజకీయ విలువలకు ప్రాధాన్యమిచ్చేందుకు ఇలాంటి పోకడలపై ఆంక్షలు పెట్టారు. 1985 లో రాజ్యాంగంలో పదో షెడ్యూలును చేర్చారు. ఒక ప్రజాప్రతినిధిని అతని సభ్యత్వానికి ఎప్పుడు అనర్హునిగా ప్రకటించవచ్చో ఈ షెడ్యూలు వివరించింది. అయితే ఒక పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు మరో పార్టీలో విలీనం కావాలని నిర్ణయించుకున్న పక్షంలో వారిని అనర్హులుగా ప్రకటించడానికి వీలు లేదు. ఇదే ఈ నలుగురు మాజీ ఎంపీలకు వరమైంది.