బోర్డర్ల వద్ద రోడ్ల నిర్మాణాలు.. పార్లమెంట్ కమిటీ సమీక్ష

తూర్పు లద్దాఖ్ లో భారత-చైనా దళాల మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. వాస్తవాధీనరేఖ వద్ద రోడ్ల నిర్మాణం మీద సమీక్షించాలని పార్లమెంట్.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిర్ణయించింది. అలాగే ఎత్తయిన కొండ ప్రాంతాల్లో..

బోర్డర్ల వద్ద రోడ్ల నిర్మాణాలు.. పార్లమెంట్ కమిటీ సమీక్ష
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 11, 2020 | 11:56 AM

తూర్పు లద్దాఖ్ లో భారత-చైనా దళాల మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. వాస్తవాధీనరేఖ వద్ద రోడ్ల నిర్మాణం మీద సమీక్షించాలని పార్లమెంట్.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిర్ణయించింది. అలాగే ఎత్తయిన కొండ ప్రాంతాల్లో విధి నిర్వహణలో  ఉండే  సాయుధ జవాన్లకు మరింత రక్షణనివ్వగల దుస్తుల సేకరణపై కూడా ఈ కమిటీ చర్చించింది. లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశానికి మొత్తం 22 మంది సభ్యులకు గాను 17 మంది హాజరయ్యారు.  కమిటీలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పానెల్ లో సీనియర్ బీజేపీ నేత భూపేందర్ యాదవ్ సహా ఈ పార్టీ సభ్యులు ఎక్కువమంది ఉన్నారు. పీఎం కేర్స్ ఫండ్ కి అందుతున్న విరాళాలపై సమావేశం చర్చించాలన్న చౌదరి సూచనను భూపేందర్ యాదవ్ తోసిపుచ్చారు.  ఈ అంశాన్ని చర్చించేందుకు పార్లమెంట్ ఆమోదం లేదని, అందువల్ల దీన్ని చర్చకు చేపట్టజాలమని ఆయన అన్నారు. యాదవ్ తో బీజేడీ, జేడీ-యు సభ్యులు ఏకీభవించారు. ‘ముఖ్యంగా భారత-చైనా బోర్డర్ల వద్ద రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఆడిట్ పై 2017 నాటి కాగ్ నివేదికలోని అంశాలను కూడా పరిశీలించాలని ఈ పానెల్ నిర్ణయించింది. తాజాగా ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారుతున్న నేపథ్యంలో పార్లమెంట్ కమిటీ.. ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత నివ్వడం విశేషం.

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?