తీరు మారని పాక్.. మళ్లీ కవ్వింపులు..!

పాక్ తన వక్రబుద్దిని నిత్యం చూపిస్తోంది. గతకొద్ది రోజులుగా నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఎల్వోసీ వెంట సరిహద్దు ప్రాంతాల గ్రామాలపై..

తీరు మారని పాక్.. మళ్లీ కవ్వింపులు..!
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 9:27 PM

పాక్ తన వక్రబుద్దిని నిత్యం చూపిస్తోంది. గతకొద్ది రోజులుగా నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఎల్వోసీ వెంట సరిహద్దు ప్రాంతాల గ్రామాలపై చిన్న చిన్న మోర్టార్ షెల్స్‌తో దాడులకు పాల్పడుతోంది. మరోవైపు జవాన్లు లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది. తాజాగా పూంచ్‌ జిల్లాలోని బాలాకోట్‌ సెక్టార్‌ మీదుగా కాల్పులకు తెగబడింది. చిన్న ఆయుధాలతో కాల్పులకు దిగుతూ.. మోర్టార్ షెల్స్‌ను కూడా ప్రయోగించింది. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ డిఫెన్స్‌ పీఆర్వో తెలిపారు. పాక్ కవ్వింపులకు ధీటుగా ఎదురు కాల్పులు చేపట్టినట్లు ప్రకటించారు.

కాగా, ఓ వైపు కాల్పులకు తెగబడుతూ.. మరోవైపు సరిహద్దుల గుండా ఉగ్రవాదులను దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. వీటిని సైన్యం ఎప్పటికప్పుడు నిరోధిస్తోంది.