ఇండియాపై ప్రతీకార చర్యలొద్దు ..పాకిస్థాన్ కు అమెరికా హితవు

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా స్పందించింది. ఇండియా మీద ఎలాంటి ప్రతీకార చర్యలకూ పాల్పడవద్దని పాకిస్థాన్‌ను కోరింది. మొదట మీ భూభాగంలో ఉగ్రవాద బృందాలను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టారో చూపండి అని కూడా సూచించింది. ఈ మేరకు ఇద్దరు డెమొక్రాట్ సభ్యులు రాబర్ట్ మెనెండెజ్, ఇలియట్ ఎంజెల్.. పాక్ కు తీవ్ర హెచ్ఛరిక చేశారు. భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ను పాక్ ప్రభుత్వం బహిష్కరించి.. ఇండియాతో […]

ఇండియాపై ప్రతీకార చర్యలొద్దు ..పాకిస్థాన్ కు అమెరికా హితవు
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 12:39 PM

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా స్పందించింది. ఇండియా మీద ఎలాంటి ప్రతీకార చర్యలకూ పాల్పడవద్దని పాకిస్థాన్‌ను కోరింది. మొదట మీ భూభాగంలో ఉగ్రవాద బృందాలను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టారో చూపండి అని కూడా సూచించింది. ఈ మేరకు ఇద్దరు డెమొక్రాట్ సభ్యులు రాబర్ట్ మెనెండెజ్, ఇలియట్ ఎంజెల్.. పాక్ కు తీవ్ర హెచ్ఛరిక చేశారు. భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ను పాక్ ప్రభుత్వం బహిష్కరించి.. ఇండియాతో దౌత్య సంబంధాలను కూడా తెగదెంపులు చేసుకునే వైఖరిని ప్రదర్శించింది. భారత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఆర్టికల్ 370 ని రద్దు చేసిందని, జమ్మూకాశ్మీర్ ను రెండు ముక్కలు చేసిందని పాకిస్తాన్ తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం ఈ అంశంపై తటస్థంగా స్పందించినప్పటికీ.. రాబర్ట్ మెనెండెజ్, ఇలియట్ ఏంజెల్ మాత్రం తమ గళాన్ని చాటారు. అమెరికా సెనేట్ లో విదేశీ వ్యవహారాలపై గల కమిటీ సభ్యులైన రాబర్ట్, ఎంజెల్.. పాక్ వైఖరిని ఖండించారు. వీరిలో రాబర్ట్.. స్టేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యుడు కాగా-ఏంజెల్ హౌస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు.

పాక్ ఇండియామీద ఎలాంటి పగలూ, ప్రతీకారాలూ పెంచుకోరాదు. వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లను ప్రోత్సహించరాదు. తన గడ్డ మీద ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకుని తీర్లాల్సిందే.. అని వీరు కోరారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు తన దేశంలోని పౌరులందరికీ రక్షణ, సమాన హక్కులు, స్వేఛ్చ కల్పించే అవకాశం ఉందని వీరు పేర్కొన్నారు. పారదర్శకత, రాజకీయ భాగస్వామ్యం… ఈ సూత్రాలకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాం అని రాబర్ట్, ఎంజెల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అంతర్గత వ్యవహారమని భారత ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తోంది.

ఇదిలా ఉండగా.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం గురించి ఇండియా తమకు మాటమాత్రమైనా చెప్పలేదని, కనీసం తమను సంప్రదించలేదని అమెరికా సన్నాయి నొక్కులు నొక్కింది. ఈ అంశం గురించి ఫిబ్రవరిలోనే ఇండియా వాషింగ్టన్ కు తెలిపిందంటూ వచ్చిన వార్తలపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ చర్య తీసుకునే ముందు ఇండియా కనీసం తమకు వెల్లడించాల్సి ఉందని దక్షిణాసియా వ్యవహారాలపై గల విదేశాంగ విభాగం తన ట్విట్టర్లో పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ ఈ అంశాన్ని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియో కు ఇదివరకే తెలిపినట్టు…. ది ప్రింట్ పత్రిక తెలిపింది. ఈ నెల 1 న థాయిలాండ్ లో తొమ్మిదో ఈస్ట్ ఆసియా సమ్మిట్ కు హాజరైన జయశంకర్ ఈ విషయాన్ని పాంపియోకు వివరించారని, అలాగే గత ఫిబ్రవరిలో పుల్వామా దాడి అనంతరం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.కూడా . అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ కు వివరించారని అనధికార వర్గాలను ఉటంకిస్తూ ఈ పత్రిక పేర్కొంది.

అవసరమైతే కాశ్మీర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిధ్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఈ ‘ అనుచిత ‘ ప్రకటన చేసినట్టు భావిస్తున్నారు.

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక