ఐరాసలో పాకిస్థాన్ పన్నాగం.,తిప్పికొట్టిన భద్రతా మండలి

ఇద్దరు ఇండియన్లను ఉగ్రవాదులుగా చూపడానికి పాకిస్థాన్ ఐరాస భద్రతా మండలిలో చేసిన పన్నాగం విఫలమైంది. అంగారా అప్పాజీ, గోవిందా పట్నాయక్ అనే భారతీయులు ఉగ్రవాదులని ఆ దేశం ఆరోపించింది.

ఐరాసలో పాకిస్థాన్ పన్నాగం.,తిప్పికొట్టిన భద్రతా మండలి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 03, 2020 | 11:21 AM

ఇద్దరు ఇండియన్లను ఉగ్రవాదులుగా చూపడానికి పాకిస్థాన్ ఐరాస భద్రతా మండలిలో చేసిన పన్నాగం విఫలమైంది. అంగారా అప్పాజీ, గోవిందా పట్నాయక్ అనే భారతీయులు ఉగ్రవాదులని ఆ దేశం ఆరోపించింది. మండలి లోని కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కమిటీ వీరిపై ఉగ్రవాద ముద్ర వేయాలని ఓ తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలు దీన్ని తిరస్కరించాయి. తన ఆరోపణను పాక్ నిరూపించలేకపోయిందని పేర్కొన్నాయి. పాక్ కుటిల యత్నాన్ని సభ్యులంతా తిరస్కరించారని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్.త్రిమూర్తి ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో కూడా పాకిస్థాన్… అజయ్ మిస్త్రీ, వేణు మాధవ్ డోంగారా అనే వ్యక్తులను టెర్రరిస్టులుగా చూపడానికి యత్నించింది.