లాక్‌డౌన్ రూల్స్ బేఖాతర్.. వేల సంఖ్యలో పోటెత్తిన జనం..

కరోనా సంక్షోభ సమయంలో.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశాలో గంజాం జిల్లాలోని పారి నౌగ‌న్ గ్రామ‌స్తులు లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. ఆల‌య ప్రారంభోత్స‌వానికి సుమారు 3 వేల మందికి

లాక్‌డౌన్ రూల్స్ బేఖాతర్.. వేల సంఖ్యలో పోటెత్తిన జనం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 15, 2020 | 4:11 PM

People Gather For Temple Inauguration: కరోనా సంక్షోభ సమయంలో.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశాలో గంజాం జిల్లాలోని పారి నౌగ‌న్ గ్రామ‌స్తులు లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. ఆల‌య ప్రారంభోత్స‌వానికి సుమారు 3 వేల మందికి పైగా హాజ‌ర‌య్యారు. వారంద‌రికి భోజ‌నాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో త‌హ‌సీల్దార్ ఫిర్యాదు మేర‌కు.. ఈ ఈవెంట్ ను నిర్వ‌హించిన ప‌లు సంస్థ‌ల అధ్య‌క్షుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క‌రోనా కేసుల తీవ్ర‌త అధికంగా ఉన్న స‌మ‌యంలో ఇలాంటి ఈవెంట్లు నిర్వ‌హించ‌డం స‌రికాద‌ని త‌హ‌సీల్దార్ పేర్కొన్నారు.

ఆ రాష్ట్రంలో గంజాం జిల్లాలోనే పాజిటివ్ కేసులు అత్య‌ధికంగా న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే 1,871కి పైగా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. ఒడిశాలో ఇప్ప‌టి వ‌ర‌కు 14,898 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 101 మంది చ‌నిపోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 4,933 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 9,864 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.