రీ-ఎంట్రీకి శ్రీశాంత్ సిద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

Cricketer Sreesanth Ban Reduced, రీ-ఎంట్రీకి శ్రీశాంత్ సిద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

జీవితకాలం నిషేధం ఎదుర్కుంటున్న టీమిండియా పేసర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శిక్ష అనుభవిస్తున్న శ్రీశాంత్‌కు ఏడేళ్లకు నిషేధాన్ని కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్‌ అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా  నిర్ణయంతో శ్రీశాంత్‌పై నిషేధం 2020 ఆగస్టులో ముగుస్తుంది. ఆ తర్వాత అతడు గ్రౌండ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. “నిషేధ కాలంలో శ్రీశాంత్‌ ఎటువంటి క్రికెట్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.. అటు బీసీసీఐ ఈవెంట్స్‌కు  ఉన్నాడని జైన్ తెలిపారు. ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకుని 13.09.2013 నుంచి ఏడేళ్ల వరకే అతడిపై నిషేధం అమలవుతుందని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *