భారీగా తగ్గిన చమురు ధరలు.. 30 ఏళ్లలో ఇదే తొలిసారి..!

రష్యాకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా పెట్రో ధరలను భారీగా తగ్గిస్తూ ధరల యుద్ధాన్ని మొదలుపెట్టింది. ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సౌదీ అరేబియా ఈ చర్యకు పూనుకొంది.

భారీగా తగ్గిన చమురు ధరలు.. 30 ఏళ్లలో ఇదే తొలిసారి..!
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2020 | 5:15 PM

Crude oil: రష్యాకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా పెట్రో ధరలను భారీగా తగ్గిస్తూ ధరల యుద్ధాన్ని మొదలుపెట్టింది. ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సౌదీ అరేబియా ఈ చర్యకు పూనుకొంది. దీంతో సోమవారం ముడి చమురు ధరలు దాదాపు 28 శాతానికిపైగా తగ్గిపోయాయి.

దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 36 డాలర్లు, అమెరికన్ డబ్ల్యుటీఐ ఆయిల్ బ్యారెల్ ధర 32 డాలర్లకు పడిపోయింది. ఓపెక్(చమురు ఉత్పత్తి దేశాల సంఘం), అనుబంధ దేశాల మధ్య ఉత్పత్తి తగ్గింపుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి.

కాగా.. ఓపెక్ సభ్యులంతా ఉత్పత్తి తగ్గింపుపై సోమవారం చర్చలో పాల్గొన్నారు. కరోనా వైరస్ భయంతో చమురు వినియోగం తగ్గినందున ఉత్పత్తి తగ్గించాలని ఓపెక్ దేశాలు నిర్ణయించాయి. కానీ ఉత్పత్తి తగ్గించడానికి రష్యా ఒప్పుకోలేదు. దీంతో ఏప్రిల్ నెలలో ఆసియా దేశాలకు ముడి చమురుని తగ్గించిన ధరలకు విక్రయిస్తామని సౌదీ అరేబియా తెలిపింది.