Viral Video of Dogs: ఈ పెంపుడు కుక్కల పద్ధతి చూస్తే వావ్ అనాల్సిందే.. మనుషులు కూడా ఇలా చేయరేమో..!

Viral Video of Dogs: పెంపుడు జంతువులలో ప్రధానంగా కుక్కల గురించి చెప్పుకోవాలి. మనుషులకు, శునకాలకు మధ్య అనుబంధం వర్ణించలేనిది.

Viral Video of Dogs: ఈ పెంపుడు కుక్కల పద్ధతి చూస్తే వావ్ అనాల్సిందే.. మనుషులు కూడా ఇలా చేయరేమో..!
Viral Video

Updated on: May 03, 2021 | 9:09 AM

Viral Video of Dogs: పెంపుడు జంతువులలో ప్రధానంగా కుక్కల గురించి చెప్పుకోవాలి. మనుషులకు, శునకాలకు మధ్య అనుబంధం వర్ణించలేనిది. ఒకసారి ఆదరిస్తే జీవితకాలం తన యజమానిపట్ల ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటుంది శునకం. కొందరైతే తమ పెంపుడు కుక్కలను తమ పిల్లలతోనే సమానంగా భావిస్తూ వాటి ఆలనాపాలనా చూస్తుంటారు. తమ తమ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పినట్లుగానే.. తమ పెంపుడు కుక్కలకు కూడా మంచి విధానాలు నేర్పిస్తుంటారు. దీనికి సంబంధించి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇప్పుడు.

సాధారణంగా చాలా మంది ప్రజలు తమ తమ సంప్రదాయం ప్రకారం.. ఎవరైనా ఆహారాన్ని భుజించేముందు ప్రార్థన చేయడం ఆనవాయితీగా పాటిస్తుంటారు. ఆ దేవుడు తమకు ఆహారం కల్పించినందుకు కృతజ్ఞతగా దేవున్ని ప్రార్థిస్తుంటారు. అదే విధానాన్ని ఓ మహిళ తన పెంపుడు కుక్కలకు కూడా అలావాటు చేసింది. వాటికి ఆహారం పెట్టి ప్రార్థన చేసిన తరువాతే దానిని తినేలా అలవాటు చేసింది. తన పెంపుడు కుక్కల ముందు ఆహారం పెట్టిన సదరు మహిళ.. ఆ ఆహారం తినే ముందు సదరు శునకాలతో ప్రార్థన చేయించారు. ఈ ఘటన అంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోను ట్విట్టర్ యూజర్ వైశాలి మాథుర్ షేర్ చేశారు. “నా స్నేహితురాలు తన పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టే ముందు వాటిచే ప్రార్థనలు చేయించేలా నేర్పించారు. చూడముచ్చటగా ఉన్న ఈ వీడియోను మీతో పంచుకుంటున్నాను. ఆ రెండు పిల్లలు మంచి అలవాటు కలిగి ఉన్నాయని భావిస్తున్నాను.’ అని మాథుర్ క్యాప్షన్ పెట్టారు.

ఇంతకీ వీడియోలో ఏముందొంటే.. ఒక మహిళ తన రెండు పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టారు. ఆ రెండు చేరోవైపు కూర్చోగా మధ్యలో మహిళ కూర్చున్నారు. చేతులతో ఆహారానికి నమస్కారం చేస్తూ ఆ మహిళ ప్రార్థన చేస్తుండగా.. ఆ డాగ్స్‌ కూడా బుద్ధిగా రెండు కాళ్లను దగ్గరకు పెట్టుకుని ప్రార్థన పూర్తయ్యేంత వరకు శ్రద్ధగా వినసాగాయి. ప్రార్థన పూర్తయిన తరువాత మహిళ ఆదేశాలతో ఆహారాన్ని భుజించాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. కొద్ది క్షణాల్లోనే 24,000 మందికిపైగా వీక్షించగా.. 1,100 మందికిపైగా లైక్స్ కొట్టారు. మరి ముచ్చటగొలిపిస్తున్న ఈ వీడియోను మీరూ చూసేయండి మరి.

Viral Video:

Also read:

venkatesh drishyam 2 : జూన్ లో రానున్న విక్టరీ వెంకటేష్ దృశ్యం 2.. ఓటీటీలోనా.. లేక థియేటర్స్ లోనా..?

Rashmika Mandanna: రష్మిక ఫ్యావరెట్ సినిమా ఏంటో తెలుసా.. తెలుగు సినిమా మాత్రం కాదట..