Viral Video: ముద్దు కావాలంటూ మొండికేసిన యువకుడు.. అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్ సహా, మోజ్ వంటి..

Viral Video: ముద్దు కావాలంటూ మొండికేసిన యువకుడు.. అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు.. ఫన్నీ వీడియో మీకోసం..
Kiss

Updated on: Jun 25, 2021 | 5:48 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్ సహా, మోజ్ వంటి వీడియో యాప్స్‌లలో అద్భుతమైన వీడియోలు మనకు నిత్యం తారసపడుతుంటూనే ఉంటాయి. కొన్ని యాక్టింగ్ వీడియోలు, నేచర్, పాటలు, ఇలా రకరకాల వీడియోలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని ప్రాంక్ వీడియోలూ ఉంటాయి. ఆ వీడియోలో ఎంతగా నవ్వు తెప్పిస్తాయో తెలిసిందే. తాజాగా అలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా పిల్లలు మారాం చేయడం చూసుంటాం. చాక్లెట్ కావాలి, డబ్బులు కావాలని, తమకు నచ్చిన వస్తువు కొనివ్వాలని, ఇతర కారణాలతో మారం చేయడం సహజం. కానీ ఒక యువకుడు మారాం చేయడం ఎప్పుడైనా చూశారా? అది కూడా రోడ్డుపై పడుకుని ముద్దు కోసం మారాం చేయడం ఎప్పుడైనా చూశారా? ఇక్కడ అదే జరిగింది. ఓ యువతిని ముద్దు కోరుతూ ఓ యువకుడు తెగ మొండికేశాడు. యువతి అంగీకరించకపోవడంతో రోడ్డుపై పడుకుని అల్లరి అల్లరి చేశాడు. చివరికి వాడి అల్లరి భరించలేక యువతి తలొగ్గింది. ముద్దు ఇస్తే వెళ్లిపోతావా? వదిలేస్తావా? అంటూ అడగింది. వెళ్లిపోతానని యువకుడు ప్రామిస్ చేయడంతో యువతికి అతనికి ముద్దు ఇచ్చేసింది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌తో రోడ్డు పక్కన ఉన్నవారంతా అవాక్కయ్యారు. ఆ తరువాత నవ్వుకున్ నారు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Minister Jagadish Reddy: ద్రోహం చేయడం వారికి ముందు నుంచే అలవాటు.. ఏపీ ప్రాజెక్టులపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్