Viral Video : ఆమె కోసం ఆయన.. వయసు పెరిగిన కరగని అనుబంధం.. వైరల్ అవుతోన్న వీడియో..

|

Aug 01, 2021 | 12:50 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏంజరిగిన క్షణాల్లో అది సోషల్ మీడియాలో..

Viral Video : ఆమె కోసం ఆయన.. వయసు పెరిగిన కరగని అనుబంధం.. వైరల్ అవుతోన్న వీడియో..
Follow us on

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాకా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో అది సోషల్ మీడియాలో షేర్ అవుతూ తెగ చక్కర్లు కొడుతుంది. ఇలా నెట్టింట చాలా వీడియోలే ఉన్నాయి. కొన్ని వీడియోలు ఒళ్ళు గగుర్లపొడిచేలా ఉంటే.. మరికొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇప్పుడు ఓ వృద్ధ జంటకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకొంటోంది. భార్య భర్తల మధ్య అనుబంధం గురించి మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం.. ఎన్నో సందర్భాల్లో వినివుంటాం.. ఒక్కసారి నమ్మి తన వెంట వచ్చిన భార్య కోసం ఏదైనా చేస్తారు కొందరు. ఇప్పుడు ఈ దంపతుల వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తోంది.

వయసు కరిగినా వారి మధ్య అనుబంధం ఇసుమంత కూడా కరగలేదు. ఈ పెద్దయన తన భార్యను రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసుంటే.. ఆమె సంతోషంతో మురిసిపోతూ కనిపించింది. ఒంట్లో ఓపిక లేకపోయినా భార్య కోసం భర్త ఫోటోగ్రాఫర్ గా మారిన వైనం అందరిని ఆకట్టుకుంటుంది. తన భార్యకు అందమైన ఫోటోలు తీయాలని ఏకంగా కింద పడుకొని మరీ ఫోటోలు తీసాడు. మధ్య మధ్యలో ఎలా ఫోజ్ పెట్టాలో కూడా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భార్య భర్తల అనురాగానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Annaatthe : ఆ వార్తల్లో నిజంలేదు.. రజినీకాంత్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Venkatesh: సంక్రాంతికి వచ్చి సందడి చేస్తా.. ఎఫ్3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..

Pushpa : విలనిజంతో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతోన్న సునీల్.. పుష్పలో ఫహాద్‌‌‌ను మించి

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..