వీడు సామాన్యుడు కాదు.. గాలిలో ఎగిరిన ఐఫోన్.. క్యాచ్ పట్టిన రైడర్.. చూస్తే షాకవ్వాల్సిందే.. Viral Video

|

May 31, 2021 | 8:12 PM

Man Caught a dropped iphone mid air: ఆధునిక ప్రపంచంలో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో వీడియోలు మనమందుకు వస్తున్నాయి. అలాంటి వీడియోలను చూస్తే మనం ఇది

వీడు సామాన్యుడు కాదు.. గాలిలో ఎగిరిన ఐఫోన్.. క్యాచ్ పట్టిన రైడర్.. చూస్తే షాకవ్వాల్సిందే.. Viral Video
Iphone
Follow us on

Man Caught a dropped iphone mid air: ఆధునిక ప్రపంచంలో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో వీడియోలు మనమందుకు వస్తున్నాయి. అలాంటి వీడియోలను చూస్తే మనం ఇది సాధ్యమేనా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటాం. సాధరణంగా మనం ఎగ్జిబిషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ రోలర్​ కోస్టర్​, జాయింట్​ విల్స్​.. లాంటి రైడింగ్​లు చేస్తుంటాం. వాటి వేగాన్ని చూస్తేనే వామ్మో అంటూ భయపడిపోతుంటాం. అలా రైడింగ్ చేసే క్రమంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

వివరాలు.. న్యూజిలాండ్​లోని బార్సిలోనాలో శామ్యుల్​ కెంఫ్​ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి అక్కడి థీమ్​ పార్కులోని రోలర్​ కోస్టర్​ రైడ్​కి వెళ్లాడు. అది యూరప్​లోనే అత్యంత వేగవంతమైన రోలర్​ కోస్టర్​లలో ఒకటిగా పేరొందింది. దీన్ని నిర్వాహకులు గంటకు 134 కిలో మీటర్ల వేగంతో తిప్పుతుంటారు. ఈ క్రమంలో, కెంఫ్​.. తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్​ చేస్తుంటాడు. గాలిలో రోలర్ కోస్టర్ జువ్వున 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. సరదాగా ఎదుట కూర్చున్న మీత్రుడు వీడియో కూడా తీస్తున్నాడు. ఈ క్రమంలో గాలిలో ఒక ఐఫోన్​ కిందకు పడటాన్ని చూశాడు. వెంటనే దాన్ని క్యాచ్​ పట్టేశాడు.

వీడియో..

కాసేపటి తర్వాత కెంఫ్​ ఈ ఫోన్​ ఎవరిదా అని చూస్తే..​ తన కన్నా రెండు వరుసల ముందు కూర్చున్న వ్యక్తిదని వెల్లడైంది. అది అనుకోకుండా అతని జేబులోనుంచి పడిపోయిందని నిర్వాహకులు తెలిపారు. వెంటనే కెంఫ్‌ అతడికి ఐఫోన్​ను తిరిగి ఇచ్చేయగా.. అతను ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం గాలిలో పట్టుకున్న ఈ ఐఫోన్ క్యాచ్​ నెట్టింట తెగ వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్​.. అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి..

Also Read:

EPFO: వేతన జీవులకు ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. మళ్లీ కోవిడ్ అడ్వాన్స్‌.. గతంలో మాదిరిగానే..

Model Rape: బాలీవుడ్‌లో కలకలం.. ప్రముఖ మోడల్‌పై అత్యాచారం.. 9 మంది సెలబ్రిటీలపై కేసు..

Juhi Chawla: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా కోర్టు మెట్లక్కిన నటి జుహీ చావ్లా..