తమిళనాడులో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

కొత్త‌ కేసులు న‌మోదైన ప‌రిస్థితి నుంచి ప్ర‌స్తుతం నాలుగు వేల‌కు చేరింది. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 4,389 మందికి కొత్త‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,79,191కి చేరింది...

తమిళనాడులో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
Follow us

|

Updated on: Oct 16, 2020 | 8:08 PM

Tamil Nadu Corona : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. నెమ్మది నెమ్మదిగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని వైద్య అధికారులు విడుదల చేస్తున్న లెక్కలు చెబుతున్నాయి. తమిళనాడును కలవరపెట్టిన కరోనా రక్కసి.. ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతున్న‌ది. ప్ర‌స్తుతం రోజుకు స‌గ‌టున 4 వేల చొప్పున కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి.

గ‌తంలో రోజుకు 10 వేల‌కుపైగా కొత్త‌ కేసులు న‌మోదైన ప‌రిస్థితి నుంచి ప్ర‌స్తుతం నాలుగు వేల‌కు చేరింది. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 4,389 మందికి కొత్త‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,79,191కి చేరింది. అందులో 6,27,703 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. మ‌రో 40,959 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అయితే క‌రోనా మాత్రం త‌మిళ‌నాడులో క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోదవుతున్నాయి. శుక్ర‌వారం కూడా 57 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 10,529కి చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.