NTR: ఎన్టీఆర్ కోసం చెర్రీ హీరోయిన్.. మాటల మాంత్రికుడి సంప్రదింపులు..!

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో'తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

NTR: ఎన్టీఆర్ కోసం చెర్రీ హీరోయిన్.. మాటల మాంత్రికుడి సంప్రదింపులు..!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 12:07 PM

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ లేదా జూలైలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నటీనటులను ఎంచుకునే పనిలో పడ్డారు త్రివిక్రమ్. ఈ క్రమంలో ఈ మూవీ కోసం హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను సంప్రదించాలనుకుంటున్నారట త్రివిక్రమ్.

కాగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది అలియా. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి రామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఆయన ప్రియురాలు సీతా మహాలక్ష్మి పాత్రలో అలియా భట్ కనిపించనున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఒప్పుకుంటే అలియా భట్ నటించే రెండో తెలుగు చిత్రం ఇదే అవుతుంది. అయితే ఈ మూవీ కోసం హీరోయిన్లుగా ఇదివరకు రష్మిక, పూజా హెగ్డే, సమంత తదితరుల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత..? ఎన్టీఆర్‌తో ఈ సారి ఎవరు రొమాన్స్ చేయబోతున్నారు..? ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది..? అనే వివరాలపై స్పష్టత రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: చెర్రీకి తెగ నచ్చేసిన లవ్ స్టోరీ.. ఆ డైరక్టర్‌తో మూవీ ఫిక్స్..!