పద్మ అవార్డులకు నామినేషన్ల స్వీకరణ.. సెప్టెంబర్‌ 15 వరకు..

పద్మ పురస్కారాలు-2021 కోసం ఆన్‌లైన్ నామినేషన్లు / సిఫారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

పద్మ అవార్డులకు నామినేషన్ల స్వీకరణ.. సెప్టెంబర్‌ 15 వరకు..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 10:49 PM

పద్మ పురస్కారాలు-2021 కోసం ఆన్‌లైన్ నామినేషన్లు / సిఫారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ అవార్డులను 2021 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. వీటికోసం ఆన్‌లైన్‌ నామినేషన్లు ఈ ఏడాది మే ఒకటో తేదీనుంచి ప్రారంభమయ్యాయి.  పద్మ అవార్డుల నామినేషన్లు లేదా సిఫార్సులను పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో మాత్రమే తీసుకుంటామని ఎంహెచ్‌ఏ పేర్కొంది.

అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్రాలు / యుటి ప్రభుత్వాలు, భారత రత్న మరియు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయవచ్చని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. పద్మ పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. ఇవి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. 1954నుంచి ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తున్నారు. అన్నిరంగాల్లో విశిష్టమైన సేవలందించిన వారికి వీటిని ప్రదానం చేస్తారు.

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక