తేజస్వీయాదవ్‌తో రహస్య ఒప్పందాలేమీ లేవు ః చిరాగ్‌ పాశ్వాన్‌

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. పార్టీలన్నీ అధికారం తమదే అన్న నమ్మకంతో ఉన్నాయి.. ఈసారి ఒంటరిగా బరిలో దిగిన లోక్‌ జనశక్తి పార్టీ కనీసం మూడునాలుగు స్థానాలలో విజయం సాధించవచ్చని సర్వేలు చెబుతున్నాయి..

తేజస్వీయాదవ్‌తో రహస్య ఒప్పందాలేమీ లేవు ః చిరాగ్‌ పాశ్వాన్‌
Follow us

|

Updated on: Oct 27, 2020 | 12:10 PM

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. పార్టీలన్నీ అధికారం తమదే అన్న నమ్మకంతో ఉన్నాయి.. ఈసారి ఒంటరిగా బరిలో దిగిన లోక్‌ జనశక్తి పార్టీ కనీసం మూడునాలుగు స్థానాలలో విజయం సాధించవచ్చని సర్వేలు చెబుతున్నాయి.. అయితే లోక్‌జనశక్తి పార్టీ వల్ల నష్టపోయేది ఎవరన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు రాజకీయ విశ్లేషకులు.. అధికార పార్టీ కూటమికి ఇది మైనస్‌గా మారుతుందా? లేక విపక్ష మహా కూటమి ఓట్లను చీలుస్తుందా అన్నది అంతుపట్టకుండా ఉంది.. అయితే ఆ పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్ మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వనని, తమ పార్టీ బీజేపీ ముఖ్యమంత్రికి మాత్రమే బాసటగా నిలుస్తుందని స్పష్టం చేశారు.. రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు తేజస్వీ యాదవ్‌తో చిరాగ్‌ పాశ్వాన్‌ రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారంటూ బీజేపీ- జనతాదళ్‌ యునైటెడ్‌ చేస్తున్న ఆరోపణలను చిరాగ్‌ ఖండించారు. తమ పార్టీ ఆర్‌జేడీ- కాంగ్రెస్‌ కూటమి అయిన మహాగడ్బంధన్‌కు కానీ, జనతాదళ్‌ యునైటెడ్‌కు కానీ సపోర్ట్‌ చేసే అవకాశమే లేదన్నారు.. కావాలంటే రాసిపెట్టుకోమని సవాల్‌ విసిరారు.. ఒకవేళ నితీశ్‌కుమార్‌నే సీఎం చేయాలని బీజేపీ భావిస్తే తాము తటస్టంగా ఉంటామే తప్ప ఆ కూటమిలో చేరమని చిరాగ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. డబుల్‌ ఇంజన్‌ కీ సర్కార్‌ ఉండాలన్నది తన అభిమతమని చెప్పారు చిరాగ్‌. అంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలో ఉండాలన్నది చిరాగ్‌ కోరుకుంటున్నారు.