హత్రాస్ కేసులో ట్విస్ట్, బాధితురాలిపై అత్యాచారం జరగలేదట !

యూపీలోని హత్రాస్ కేసులో కొత్త ట్విస్ట్ ! ఇరవై ఏళ్ళ బాధితురాలిపై గ్యాంగ్ రేప్, టార్చర్ జరిగిందని, ఆమె తీవ్ర గాయాలకు గురై మరణించిందని ఆటాప్సీ రిపోర్టులో రాగా-తుది (ఫైనల్) డయాగ్నసిస్ లో మాత్రం రేప్ గురించిన ప్రస్తావన లేనట్టు..

హత్రాస్ కేసులో ట్విస్ట్, బాధితురాలిపై అత్యాచారం జరగలేదట !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 01, 2020 | 7:41 PM

యూపీలోని హత్రాస్ కేసులో కొత్త ట్విస్ట్ ! ఇరవై ఏళ్ళ బాధితురాలిపై గ్యాంగ్ రేప్, టార్చర్ జరిగిందని, ఆమె తీవ్ర గాయాలకు గురై మరణించిందని ఆటాప్సీ రిపోర్టులో రాగా-తుది (ఫైనల్) డయాగ్నసిస్ లో మాత్రం రేప్ గురించిన ప్రస్తావన లేనట్టు తెలుస్తోంది. ఆమె విసెరాకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులో..ఆమెపై రేప్ గానీ, గ్యాంగ్ రేప్ గానీ జరగలేదని స్పష్టమైందని యూపీ పోలీసులు చెబుతున్నారు. బాధితురాలు తన మెడకు అయిన గాయం వల్లే మృతి చెందిందని పోస్ట్ మార్టం తుది నివేదిక వెల్లడిస్తోందని యూపీ పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కొంతమంది ఈ విషయాన్ని వక్రీకరించి ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు ప్రచారం చేశారని, అలాంటి వారిని గుర్తించి వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పారు. కుల సంబంధమైన ఉద్రిక్తతలను రెచ్ఛగొట్టేందుకే వారీ పని చేసినట్టు కనిపిస్తోందన్నారు. నలుగురు అగ్రవర్ణ యువకులు ఈమెపై దారుణంగా అత్యాచారం జరిపి, చిత్ర హింసల పాల్జేశారని, దాంతో ఆమె తీవ్రంగా గాయపడి మరణించిందని వార్తలు వచ్చాయి.