‘ఒకటి, రెండు కరోనా కేసులుంటే ఆఫీసంతా సీల్ చేయనక్కర్లేదు’.. కేంద్రం

ఏ ఆఫీసులోనైనా ఒకటి, రెండు కరోనా కేసులు బయట పడితే.. ఆఫీసంతా మూసివేయనక్కరలేదని, కేవలం సంబంధిత రోగులున్న ప్రాంతాన్ని డిస్ ఇన్ఫెక్ట్ చేస్తే సరిపోతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన కొత్త గైడ్ లైన్స్ లో ప్రకటించింది. కార్యాలయాన్ని మొత్తం సీల్ చేయడం గానీ, అందులోని ఇతర విభాగాల్లో పనులను నిలుపుదల చేయడం గానీ అవసరం లేదని స్పష్టం చేసింది.  ప్రోటోకాల్ ప్రకారం.. సంబంధిత ప్రదేశంలో డిస్ ఇన్ఫెక్ట్ చేశాక మళ్ళీ పనులను ప్రారంభించుకోవచ్ఛునని క్లారిటీ ఇచ్చింది. […]

'ఒకటి, రెండు కరోనా కేసులుంటే ఆఫీసంతా సీల్ చేయనక్కర్లేదు'.. కేంద్రం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 19, 2020 | 4:27 PM

ఏ ఆఫీసులోనైనా ఒకటి, రెండు కరోనా కేసులు బయట పడితే.. ఆఫీసంతా మూసివేయనక్కరలేదని, కేవలం సంబంధిత రోగులున్న ప్రాంతాన్ని డిస్ ఇన్ఫెక్ట్ చేస్తే సరిపోతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన కొత్త గైడ్ లైన్స్ లో ప్రకటించింది. కార్యాలయాన్ని మొత్తం సీల్ చేయడం గానీ, అందులోని ఇతర విభాగాల్లో పనులను నిలుపుదల చేయడం గానీ అవసరం లేదని స్పష్టం చేసింది.  ప్రోటోకాల్ ప్రకారం.. సంబంధిత ప్రదేశంలో డిస్ ఇన్ఫెక్ట్ చేశాక మళ్ళీ పనులను ప్రారంభించుకోవచ్ఛునని క్లారిటీ ఇచ్చింది. గత 48 గంటల్లో కరోనా పేషంట్ విజిట్ చేసిన ఏరియాలను మాత్రమే క్లోరినేట్ చేస్తే సరిపోతుంది.. అయితే ఎక్కువ కరోనా కేసులు ఉంటే మాత్రం 48 గంటల పాటు ఆ భవనాన్ని సీల్ చేయాలని, అంతవరకు సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే చాలు అని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక ఆఫీసు సిబ్బంది ఒక మీటర్ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, హ్యాండ్ శానిటైజర్లను కూడా వాడాలని సూచించింది.