రజనీ సినిమాలో చెన్నై బ్యూటీ..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. ప్రస్తుతం ముంబై లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ నివేదా థామస్ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్న […]

రజనీ సినిమాలో చెన్నై బ్యూటీ..?
Follow us

|

Updated on: Apr 25, 2019 | 6:29 PM

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. ప్రస్తుతం ముంబై లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ నివేదా థామస్ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు.

బాలీవుడ్ యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.