‘అసెంబ్లీ ఎన్నికల తరువాత నితీష్ మారిపోతారు’ : చిరాగ్ పాశ్వాన్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ పట్ల సీఎం నితీష్ కుమార్ అసలు స్వరూపం బట్టబయలవుతుందని ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీయేని సవాల్ చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ ఊసరవెల్లి వంటివారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. ఆయన రంగులు మార్చేవారని విమర్శించారు. కానీ మేము మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటాం అని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. లాలూ […]

'అసెంబ్లీ ఎన్నికల తరువాత నితీష్ మారిపోతారు' : చిరాగ్ పాశ్వాన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 01, 2020 | 9:46 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ పట్ల సీఎం నితీష్ కుమార్ అసలు స్వరూపం బట్టబయలవుతుందని ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీయేని సవాల్ చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ ఊసరవెల్లి వంటివారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. ఆయన రంగులు మార్చేవారని విమర్శించారు. కానీ మేము మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటాం అని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం గా ఉన్నప్పుడు నితీష్ ఒకలా, ఆతరువాత మరొకలా, వ్యవహరించారని, ఒకసారి బీజేపీ ని దూరం పెట్టడం, మళ్ళీ ఆ పార్టీకి దగ్గర కావడం ఆయనకే చెల్లిందని చిరాగ్ ఆరోపించారు.