హిమాచల్‌ప్రదేశ్‌ ప్రధాన నగరాలలో డిసెంబర్‌ 15 వరకు నైట్‌ కర్ఫ్యూ

కరోనా వైరస్‌ను ఎంతగా నియంత్రించాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు.. పైపెచ్చు మరింత వ్యాపిస్తోంది.. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు విన్నవించుకుంటున్నా..

హిమాచల్‌ప్రదేశ్‌ ప్రధాన నగరాలలో డిసెంబర్‌ 15 వరకు నైట్‌ కర్ఫ్యూ
Follow us

|

Updated on: Nov 23, 2020 | 5:05 PM

కరోనా వైరస్‌ను ఎంతగా నియంత్రించాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు.. పైపెచ్చు మరింత వ్యాపిస్తోంది.. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు విన్నవించుకుంటున్నా చెవికి ఎక్కించుకోవడం లేదు.. అందుకే ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలు తమ ప్రధాన నగరాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి.. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్తాన్‌ రాష్ట్రాలు వారానికి మూడు రోజుల చొప్పున నైట్‌ కర్ఫ్యూ విధించాయి.. హిమాచల్‌ప్రదేశ్‌ కూడా ఈ బాటలోనే పయనించింది.. డిసెంబర్‌ 15 వరకు మండి, సిమ్లా, కులు, కాంగ్రా పట్టణాలలో నైట్‌ కర్ఫ్యూ విధించింది.. ఈ నిబంధన రేపటి నుంచి అమలులోకి వస్తుంది.. ఒక్క కర్ఫ్యూతోనే కరోనాను నియంత్రించలేమని తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్‌ సర్కారు ప్రభుత్వ కార్యాలయాలను 50 శాతం ఉద్యోగులతోనే పని చేయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో క్లాస్‌-3, క్లాస్‌-4 ఉద్యోగులు ఇక నుంచి 50 శాతం మాత్రమే హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.. ఈ నిబంధన వచ్చే నెల 31 వరకు అమలులో ఉంటుంది..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు