ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‌లపై అక్తర్ వ్యధ!

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో ‘‘క్రికెట్ నాణ్యత’’ లోపించడం తనను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని పాకిస్థాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్స్‌లో చోటు ఖాయం చేసుకోగా… ఇంగ్లండ్‌పై ఓడిపోయినప్పటికీ న్యూజీలాండ్ కూడా నాకౌట్ స్టేజ్‌లో నిలబడింది. దీంతో అక్తర్ తన యూట్యూబ్ చానెల్‌లో స్పందిస్తూ.. ‘‘క్రికెట్‌లో నాణ్యత దారుణంగా పడిపోయింది. పరుగులు స్కోర్ చేయడం మంచినీళ్లు తాగినంత సులభంగా మారిపోయింది. బౌలర్లకు ఏమాత్రం నాణ్యత లేదు. […]

ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‌లపై అక్తర్ వ్యధ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2019 | 6:10 PM

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో ‘‘క్రికెట్ నాణ్యత’’ లోపించడం తనను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని పాకిస్థాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్స్‌లో చోటు ఖాయం చేసుకోగా… ఇంగ్లండ్‌పై ఓడిపోయినప్పటికీ న్యూజీలాండ్ కూడా నాకౌట్ స్టేజ్‌లో నిలబడింది. దీంతో అక్తర్ తన యూట్యూబ్ చానెల్‌లో స్పందిస్తూ.. ‘‘క్రికెట్‌లో నాణ్యత దారుణంగా పడిపోయింది. పరుగులు స్కోర్ చేయడం మంచినీళ్లు తాగినంత సులభంగా మారిపోయింది. బౌలర్లకు ఏమాత్రం నాణ్యత లేదు. 1990, 2000ల కాలంలో ఉన్న మాదిరిగా పేస్, స్పిన్ బౌలర్లకు బౌలింగ్‌లో నాణ్యత లేదు. దీనికి తోడు మూడు పవర్‌ప్లేలు, రెండు కొత్త బంతులతో పరుగులు చేయడం మరింత సులభంగా మారింది…’’ అని పేర్కొన్నాడు.

కాగా న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో విజయం సాధించడంపైనా అక్తర్ స్పందించాడు. న్యూజిలాండ్ జట్టు ‘‘చెత్తగా’’ ఆడడం వల్లే ఓడిపోయిందన్నాడు. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ విజయం సాధించడంతో పాకిస్తాన్ దాదాపుగా సెమీ ఫైనల్స్‌కు దూరమైనట్టే. అయితే పాకిస్తాన్ తనంత తానుగా సెమీస్‌లో చోటు కోల్పోయిందని అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌తో మాకు తీవ్ర నష్టం జరిగింది. తర్వాత శ్రీలంకపై జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మావాళ్లు ఆస్ట్రేలియాపై ఓడిపోయారు. ఈ మూడు మ్యాచ్‌లు పాకిస్తాన్‌ కష్టాలకు కారణమయ్యాయని అక్తర్ వివరించాడు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో