Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు. మామూలుగా అయితే ఈ వర్షాలకు జనం సేదతీరేవారే! కానీ కరోనా కాలం కావడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతున్న భయం వెంటాడుతోంది
  • లాక్‌డౌన్‌పై ప్రజలకు పూర్తి అవగాహన ఉండటంతో మంచి సహకారమే అందుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. అంతర్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలను కట్టడి చేసేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 5 వేల కేసులు నమోదుచేశామన్నారు.
  • ఆరోగ్యసేతు యాప్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారంతోపాటు... వ్యాధి లక్షణాలు, దగ్గర్లో ఎక్కడెక్కడ హెల్త్‌ సెంటర్స్‌ ఉన్నాయన్న సమాచాం లభిస్తుంది. వీటితోపాటు మనం కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రాంతానికి వెళ్తే అలర్ట్ వస్తుంది. అయితే కొన్నిచోట్ల ఈ యాప్‌ పనిచేయడం లేదు. దీంతో గందరగోళానికి పడిపోయిన వినియోగదారులు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వ్యాధి ప్రబలడం తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలను, అంతర్జాతీయ స్థాయిలో పాటించబడిన పద్దతులను మనం అనుసరిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

కేసీఆర్ న్యూఇయర్ రిజల్యూషన్ ఇదే

kcr new year resolution, కేసీఆర్ న్యూఇయర్ రిజల్యూషన్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సంవత్సరం సందర్భంగా సరికొత్త తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు పాటించాలని సూచించారు. 2020 సంవత్సరంలో అందరికీ బాగుండాలంటూ శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్.. దాంతోపాటు తన సంకల్పంలో రాష్ట్ర ప్రజలంతా భాగస్తులు కావాలని కోరారు. ఇంతకీ కేసీఆర్ తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటి ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన అయిదున్నర సంవత్సరాలలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని, అందుకు తాను గర్విస్తున్నానని కేసీఆర్ తన కొత్త సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. సాధించిన విజయాలిచ్చిన స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా ప్రజలంతా సంకల్ప సాధనకు క‌ృషి చేయాలన్నారు.

కొత్త సంవత్సరం 2020లో ఈచ్ వన్ – టీచ్ వన్ (EACH ONE – TEACH ONE) అంటూ కొత్త నినాదాన్ని, సరికొత్త సంకల్పాన్ని ఇచ్చారు కేసీఆర్. తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో తీర్చి దిద్దాలన్నదే ఈ కొత్త నినాదం లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రతీ ఒక్క తెలంగాణ పౌరుడు.. కనీసం ఒక్కరికన్నా విద్యా నేర్పించాలన్నదే ఈ సంకల్పంలో లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరు ప్రతిఙ్ఞ తీసుకోవాలని సూచించారు. ఇలా చదువుకున్న ప్రతీ ఒక్కరు కనీసం ఒక్కరికి విద్య నేర్పినా ఏడాదిలో తెలంగాణ వంద శాతం అక్షరాస్యతా రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని, తన సంకల్పంలో ప్రతీ ఒక్కరు పాలుపంచుకోవాలని కేసీఆర్ కోరారు.

Related Tags