ఎన్నికలను బహిష్కరించిన ఆ గ్రామస్థులు.. రీజన్ ఏంటంటే..?

ఎన్నికలు.. ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియ. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటారు. ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చుతుంటారు. తీర్చాలి కూడా. కానీ ఎన్నికైన తర్వాత ఆ ప్రతినిధులు ప్రజలను పట్టించుకోకపోతే.. అప్పుడు ఆ ప్రజలు ఏం చెయ్యాలి. ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ ఆ ప్రతినిధులను ఎదిరియ్యాలంటే.. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడే. అప్పుడే వారికి ప్రశ్నించే సమయం వస్తుంది. కానీ అలా చాలా సార్లు ప్రశ్నించినా కూడా సమస్య తీరకపోతే.. అప్పుడు […]

ఎన్నికలను బహిష్కరించిన ఆ గ్రామస్థులు.. రీజన్ ఏంటంటే..?
Follow us

| Edited By:

Updated on: Oct 22, 2019 | 5:53 AM

ఎన్నికలు.. ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియ. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటారు. ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చుతుంటారు. తీర్చాలి కూడా. కానీ ఎన్నికైన తర్వాత ఆ ప్రతినిధులు ప్రజలను పట్టించుకోకపోతే.. అప్పుడు ఆ ప్రజలు ఏం చెయ్యాలి. ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ ఆ ప్రతినిధులను ఎదిరియ్యాలంటే.. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడే. అప్పుడే వారికి ప్రశ్నించే సమయం వస్తుంది. కానీ అలా చాలా సార్లు ప్రశ్నించినా కూడా సమస్య తీరకపోతే.. అప్పుడు ఏం చెయ్యాలి. నిరసన తెలపడమే తరువాయి. మహారాష్ట్రలోని గ్రామంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఆ గ్రామం బహిష్కరించింది. దానికి కారణం తెలిస్తే.. షాక్‌కు గురవ్వాల్సిందే.

వివరాల్లోకి వెళితే.. నందూర్బార్‌ జిల్లా మనిబేలి గ్రామస్థులు నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. ఆ గ్రామంలో మొత్తం 135 మంది ఓటర్లు ఉండగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు. వీరంతా పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామానికి కరెంట్, రోడ్డు సౌకర్యం లేదంటూ.. పోలింగ్ బహిష్కరించారు. ఓ వైపు దేశంలో నూటికి నూరు శాతం విద్యుత్‌ సదుపాయాన్ని సాధించామని ప్రధాని చెప్తూ ఉంటే.. ఈ ఘటన చూస్తే ఖంగుతినాల్సిందే. ప్రభుత్వం పేపర్లపై ప్రకటనలు చేస్తోందని దీన్ని బట్టి అర్ధమవుతోంది.

తాము ఇంకా రాజకీయ నాయకుల వెంటబడి తమ కనీస అవసారలను తీర్చమని మొరపెట్టుకోలేమని.. ఇప్పటికే అనేక సార్లు కరెంట్‌ కావాలి, రోడ్డు కావాలి అంటూ తిరిగి తిరిగి ఓపిక నశించిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ వేచి చూశామని.. ఇక చివరి ప్రయత్నంగా అసెంబ్లీ పోలింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించామని నటర్వ్‌ భాయ్‌ టాడ్వీ అనే అరవై ఏళ్ల వృద్ధుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన “ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన” కింద రెండేళ్ల క్రితమే తమ గ్రామానికి 8 కిలోమీటర్ల రోడ్డు మంజూరు అయ్యిందని, అయితే అది ఇప్పటికీ కాగితాలకే పరిమితం అయిందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు..400 గేట్లు..రూ2.9 లక్షల కోట్లు
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు..400 గేట్లు..రూ2.9 లక్షల కోట్లు
అత్తగారితో అల్లుడి ఎఫైర్.. రెడ్ హ్యాండ్‌గా పట్టుబడడంతో పెళ్లి
అత్తగారితో అల్లుడి ఎఫైర్.. రెడ్ హ్యాండ్‌గా పట్టుబడడంతో పెళ్లి
రూ.49కే నాలుగు ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. బీఎస్ఎన్ఎల్ నుంచి అద్భుత
రూ.49కే నాలుగు ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. బీఎస్ఎన్ఎల్ నుంచి అద్భుత
ఈ చిచ్చరపిడుగు ఆ స్టార్ హీరోయినా .. ! సింగర్‏గా అదరగొట్టేసింది..
ఈ చిచ్చరపిడుగు ఆ స్టార్ హీరోయినా .. ! సింగర్‏గా అదరగొట్టేసింది..
మా మంచి మాస్టారు..! పిల్లల్ని బడికి రప్పించేందుకు భలే ప్లాన్‌
మా మంచి మాస్టారు..! పిల్లల్ని బడికి రప్పించేందుకు భలే ప్లాన్‌
300ల స్కోర్ బాదేస్తాం.. హైదరాబాద్ బిర్యానీ అంటే మస్త్ ఇష్టం
300ల స్కోర్ బాదేస్తాం.. హైదరాబాద్ బిర్యానీ అంటే మస్త్ ఇష్టం
వేసవిలో ఫోన్‌ ఛార్జింగ్‌ వేగం ఎందుకు తగ్గుతుంది? కారణాలు ఇవే..!
వేసవిలో ఫోన్‌ ఛార్జింగ్‌ వేగం ఎందుకు తగ్గుతుంది? కారణాలు ఇవే..!
దాన్ని పెళ్ళిగా పరిగణించలేం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
దాన్ని పెళ్ళిగా పరిగణించలేం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
మట్టి కింద కనిపించిన వింత రాయి.. ఏంటని పగలగొట్టి చూడగా.!
మట్టి కింద కనిపించిన వింత రాయి.. ఏంటని పగలగొట్టి చూడగా.!
ఇ-ఇన్సూరెన్స్ ఖాతా అంటే ఏమిటి? ఎక్కడ దరఖాస్తు చేయాలి?
ఇ-ఇన్సూరెన్స్ ఖాతా అంటే ఏమిటి? ఎక్కడ దరఖాస్తు చేయాలి?