అందాలతో కుర్రకారును క్లీన్ బౌల్డ్ ప్రియాంక జవాల్కర్

Phani.ch

01 May 2024

ప్రియాంక జవాల్కర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది.

ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది.

టాక్సీవాలా  సినిమాలో మాటే విన‌దుగా అంటూ కుర్రాళ్ల మ‌తులు చెడగొట్టింది ఈ ముద్దుగుమ్మ‌.  ఎలాగైనా తెలుగు ఇండ‌స్ట్రీలోజెండా పాతేయాల‌ని అనుకుంది.

ఆ తర్వాత  తిమ్మరుసు, SR కళ్యాణ మండపం సినిమాలతో వరుస సక్సెస్‌లను అందుకుంది. కాకపొతే ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు దొరకటంలేదనే చెప్పాలి.

ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయి. ఈమె 12 నవంబర్ 1992లో ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురంలో మరాఠీ ఫ్యామిలీలో పుట్టింది.

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకుంది. ఆ తర్వాత అమెరికాలో ఓ MNC కంపెనీలో పనిచేసింది. ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.

ఒక‌ప్పుడు మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో వాళ్ల‌కు వ‌ర‌స‌గా అవ‌కాశాలు ఇచ్చేవాళ్లు కానీ ఇప్పుడు మాత్రం అంత ఈజీ కాదు. అందుకే చాలా మ‌న ముద్దుగుమ్మ‌లు ల‌క్ టెస్ట్ చేసుకుంటున్నారు.