Watch Video: దర్జాగా కారులో వచ్చి వీధిలో కరెంట్ బల్బులు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా.. చూడబోతే పెద్ద స్కెచ్‌తోనే..

|

Nov 09, 2022 | 6:52 PM

దొంగతనం చేసేందుకు చోరశిఖామణులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ బుద్ధికి పదును పెడుతున్నారు. దర్జాగా వచ్చి దోచుకెళ్తున్నారు. ఐతే.. ఎవరి కంట పడకుండా, దొంగతనం చేయాలని నిర్ణయించుకున్న ఓ దొంగల ముఠా బారీ స్కెచ్‌ వేసి, కారులో వచ్చిమరీ..

Watch Video: దర్జాగా కారులో వచ్చి వీధిలో కరెంట్ బల్బులు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా.. చూడబోతే పెద్ద స్కెచ్‌తోనే..
Thieves arrive in car to steal lightbulbs
Follow us on

దొంగతనం చేసేందుకు చోరశిఖామణులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ బుద్ధికి పదును పెడుతున్నారు. దర్జాగా వచ్చి దోచుకెళ్తున్నారు. ఐతే.. ఎవరి కంట పడకుండా, దొంగతనం చేయాలని నిర్ణయించుకున్న ఓ దొంగల ముఠా బారీ స్కెచ్‌ వేసి, కారులో వచ్చిమరీ స్ట్రీట్‌ లైట్లను ఎత్తుకెళ్లారు. ఐతే సీసీ కెమరాల్లో ఈ దృష్యాలు రికార్డుకావడంతో అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకెళ్తే..

రాజస్థాన్‌ రాష్ట్రం, ఝున్‌ఝునులోని కొల్సియా గ్రామంలో ఉన్న ఓ వీధిలో దొంగలు కరెంట్ బల్బులను ఎత్తుకెళ్లేందుకు స్కెచ్‌ వేశారు. చీకటి పడటంతో దొంగతనం చేసేందుకు సులువుగా ఉంటుందని భావించారు. ఫ్లాన్ వర్కట్ కాకపోవడంతో పారిపోయారు. నవాల్ గర్హ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కోల్సియా గ్రామంలోకి అర్ధరాత్రి సమయంలో మారుతి ఆల్టో కారులో వచ్చారు దొంగలు. అయితే అక్కడంత కరెంట్ బల్బులతో వెలుతురుగా ఉండటంతో మెదడుకు పదును పెట్టారు. ఓ షాపు వద్ద కారును ఆపి అక్కడున్న బల్బును దొంగిలించాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. మరో షాపు వద్దకు వచ్చి కుర్చీ సాయంతో.. కరెంట్ బల్బును దొంగిలించారు. అనంతరం దుకాణం దోపిడీకి యత్నించారు. అయితే దొంగలు షట్టర్‌ను తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా.. ఓ దుకాణదారుడికి మెలకువ వచ్చింది. ఆ షాపు యజమానిని గమనించిన దొంగలు అక్కడ్నుంచి పలాయనం చిత్తగించారు.

అయితే షాపుల ముందు ఉన్న బల్బులను దొంగిలించి, చీకట్లో దోపిడీ చేసేందుకు దొంగలు ప్లాన్ చేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐతే దొంగలు కేవలం బల్బుల కోసమే వచ్చారా? బల్బులను తొలగించి అక్కడి దుకాణాల్లో చోరీకి యత్నించారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ స్ట్రీట్‌ బల్బుల దొంగలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.