Viral Video: ఈ అమ్మాయి మాటలకి ఫిదా అయిన సీఎం.. ఏమన్నా మాట్లాడిందా భయ్యా.!

|

Oct 22, 2024 | 1:10 PM

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేసినా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతుంటాయి.. వారు ఏం మాట్లాడినా క్షణాల్లో నెటింట్లో ఆ వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియో అందరీన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

Viral Video: ఈ అమ్మాయి మాటలకి ఫిదా అయిన సీఎం.. ఏమన్నా మాట్లాడిందా భయ్యా.!
Bundeli Influencer Binnu Ra
Follow us on

ఛతర్‌పూర్‌కు చెందిన 12 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బిన్ను రాణి అసలు పేరు దీపా యాదవ్..ఈమె ఇటీవల భోపాల్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లింది. బుందేలీ భాషా వీడియోలతో ఆమె పాపులర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌ను అధికారిక సమావేశంలో కలిసింది. తన బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి యాదవ్ బిన్నూ రాణి కోసం సమయాన్ని వెచ్చించారు. ఆమె సీఎంను కలిసినప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి ఆమెను అనుమతించారు. బిన్ను రాణి తన ప్రేక్షకులతో మాట్లాడుతూ, “హలో గైస్ సబ్‌ఖోన్ రామ్-రామ్ పెహ్చే. ఆజ్ హమ్ ముఖ్యమంత్రి జీ కే పాస్ ఆయే తే భోపాల్. తో గైజ్ హమేన్ ఇత్నా అచ్చా లాగో మిల్కే” అని ఉద్వేగంగా చెప్పింది. ముఖ్యంగా లైక్, షేర్ సబ్‌స్క్రయిబ్ చేయమని సీఎంతోనే చెప్పించడంతో అది వైరల్‌గా మారింది.

బిన్ను రాణి తన వీడియోలను చూశారా అని ముఖ్యమంత్రిని అడిగింది. సీఎం హాస్యంతో స్పందిస్తూ, “ఆప్కో దేఖ్కర్ హీ దర్ లాగ్ రహా హై” అని చెప్పడంతో అక్కడ ఉన్న అధికారులను పక్కాపక్కా నవ్వారు. నీటి వృధాపై పొరుగువారితో చర్చిస్తున్న వీడియో వైరల్ కావడంతో బిన్ను రాణి ప్రజాదరణ పొందింది. ఆమె బంధువు క్లిప్‌ను రికార్డ్ చేశాడు, ఇది త్వరగా మిలియన్ల వీక్షణలను సంపాదించింది. ఆమెకు బలమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతూ, బంధువులతో నివసిస్తున్న బిన్ను రాణి తన వీడియోలలో హాస్యం, సాంస్కృతిక సూచనలు చేస్తుంది.

వీడియో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…