జాగ్వార్ కారు బీభత్సం.. ఒకరు మృతి, 8మందికి సీరియస్.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ బీభత్సం సృష్టింది. జాగ్వార్ కారు పాదాచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈదారుణానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కామధేను స్వీట్ హౌస్ యజమాని మేనల్లుడు రచిత్ మధ్యన్ అనే వ్యకతి అతి వేగంగా కారు నడిపి, ఎనిమిది మందిని చితకబాది, ఒకరిని చంపాడు.

జాగ్వార్ కారు బీభత్సం.. ఒకరు మృతి, 8మందికి సీరియస్.. షాకింగ్ దృశ్యాలు వైరల్!
Jaguar Car Accident

Updated on: Oct 22, 2025 | 8:34 PM

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ బీభత్సం సృష్టింది. జాగ్వార్ కారు పాదాచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈదారుణానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కామధేను స్వీట్ హౌస్ యజమాని మేనల్లుడు రచిత్ మధ్యన్ అనే వ్యకతి అతి వేగంగా కారు నడిపి, ఎనిమిది మందిని చితకబాది, ఒకరిని చంపాడు.

లక్నోలో ఆసుపత్రిలో చేరిన రచిత్‌ను మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అతని పరిస్థితి మెరుగుపడటంతో అరెస్టు చేశారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నిందితుడు రచిత్, రాజ్‌రూప్పూర్ మార్కెట్‌లో అనేక వాహనాలను ఢీకొట్టి, ఎనిమిది మందిపైకి దూసుకుకెళ్లాడు.

అక్టోబర్ 19న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వేగంగా వస్తున్న జాగ్వార్ కారు అనేక వాహనాలు, పాదచారులను ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. మృతుడిని ప్రదీప్ పటేల్ అనే ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు పిల్లలు సహా మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. డ్రైవర్ రచిత్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు రచిత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌ అవుతోంది. రాజ్‌రూపర్ ప్రాంతంలో గందరగోళానికి కారణమైన కారు ట్రాఫిక్ సిగ్నల్ తప్పించుకునే క్రమంలో పాదచారులపై దూసుకుంటూ వెళ్లింది. కారు డ్రైవర్ రచిత్ మధ్యన్ బాగా మద్యం సేవించి కనిపించాడని, తరువాత పోలీసులు స్పృహలో లేని అతన్ని రక్షించిన తర్వాత లక్నోలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి అరెస్టు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..