Vande Mataram: పార్లమెంట్‌లో ‘వందేమాతరం’ బిల్లు?.. అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్షకు ప్రతిపాదన!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాటిలో అత్యంత చర్చనీయాంశంగా మారిన 'జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026' కూడా ఒకటిగా పేర్కొంటున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే, 'వందేమాతరం' గీతాన్ని అవమానించడం, ఆలపించడాన్ని, వాయించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే అవకాశం ఉంది.

Vande Mataram: పార్లమెంట్‌లో వందేమాతరం బిల్లు?.. అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్షకు ప్రతిపాదన!
Home Minister Amit Shah

Updated on: Jul 17, 2026 | 6:10 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాటిలో అత్యంత చర్చనీయాంశంగా మారిన ‘జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026’ కూడా ఒకటిగా పేర్కొంటున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే, ‘వందేమాతరం’ గీతాన్ని అవమానించడం, ఆలపించడాన్ని, వాయించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే అవకాశం ఉంది.

ప్రతిపాదిత బిల్లు ప్రకారం, ప్రస్తుతం జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణ తరహాలోనే ‘వందేమాతరం’కు కూడా రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నేరం రుజువైతే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించడం, వాయించడం సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో, ఇప్పుడు దీనికి చట్టబద్ధత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుతో పాటు ఆదాయపు పన్ను సవరణలు, న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు కీలక బిల్లులను కూడా ప్రభుత్వం తీసుకురానున్నట్లు సమాచారం.

ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభిస్తే, జాతీయ పతాకం, జాతీయ గీతం, రాజ్యాంగం వంటి ఇతర జాతీయ చిహ్నాలకు ఉన్న చట్టపరమైన రక్షణ మాదిరిగానే ‘వందేమాతరం’కు కూడా ప్రత్యేక రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే, బిల్లు అధికారికంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాతే తుది నిబంధనలు, శిక్షలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన రాజకీయంగా, న్యాయపరంగా విస్తృత చర్చకు దారితీసే అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us