విజయ్‌కి ఆ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది.. టీవీకే విజయంపై తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందిస్తూ, విజయ్‌కి గెలుపుపై ఎలాంటి అనుమానం లేదని, అందుకే పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇది చారిత్రక విజయమని, తమిళనాడుకు మంచి తరుణమని పేర్కొన్నారు. సమాజ సేవ చేయాలనే ఆలోచన విజయ్‌కి ఎప్పటి నుంచో ఉందని చెప్పారు.

విజయ్‌కి ఆ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది.. టీవీకే విజయంపై తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
Vijay Father Chandrasekhar

Updated on: May 04, 2026 | 3:46 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే దూసుకెళ్లింది. దాదాపు 105 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన అనతీకాలంలోనే విజయ్ తమిళనాడులో సరికొత్త చరిత్రను లిఖించారు. విజయ్ పార్టీ హవా ముందు అధికార డీఎంకే పార్టీ చతికిలపడిపోయింది. విజయ్ పార్టీ తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే కూటమి రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.. అయితే.. విజయ్ విజయంపై ఆయన తండ్రి చంద్రశేఖర్ స్పందించారు. విజయ్ విజయంపై ఆనందం వ్యక్తం చేసిన చంద్రశేఖర్.. సీఎంకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. గెలుపుపై విజయ్‌కి ఒక్క శాతం కూడా అనుమానం లేదని తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. అందుకే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోలేదన్నారు. ఇది చారిత్రక విజయమని.. తమిళనాడుకు ఇప్పుడు మంచి తరుణం వచ్చిందని విజయ్ తండ్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు.

సమాజానికి ఏదైన చేయాలనే ఆలోచన విజయ్‌కి ఎప్పటి నుంచో ఉందని.. విజయ్‌ని తమిళనాడు ప్రజలు ఇంట్లో బిడ్డగా చూశారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మహిళలు, యువత గుండెల్లో పెట్టుకున్నారని.. విజయ్‌ని అందరు అన్నా అని పిలుస్తారని చంద్రశేఖర్ గుర్తుచేశారు.

కాగా.. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే విజయపథంలో దూసుకెళుతోంది. దీంతో విజయ్‌ కుటుంబ సభ్యులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. టీవీకే పార్టీ గుర్తు అయిన విజిల్‌ వేస్తూ ఎంజాయ్‌ చేశారు. అంతేకాకుండా విజయ్‌ నివాసం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. హీరోయిన్ త్రిష విజయ్‌ ఇంటికొచ్చారు. ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత త్రిష నేరుగా విజయ్‌ ఇంటికి వెళ్లారు. ఫలితాల టైమ్‌లో అందరిదృష్టి త్రిషపైనే.. పడింది. దీంతో సోషల్ మీడియాలో త్రిష, విజయ్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us