TV9 Festival of India 2026: ప్రారంభమైన టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి

దేశ రాజధాని ఢిల్లీలోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ నేషనల్‌ స్టేడియంలో టీవీ9 ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా 2026 నాలుగో సీజన్‌ ప్రారంభమైంది. అక్టోబర్‌ 16 నుంచి 20 వరకు ఐదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో దుర్గాపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీలు, దాండియా నైట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తొలి రోజు ప్రముఖ సుఫీ గాయని హర్ష్‌దీప్‌ కౌర్‌ లైవ్‌ కచేరీ నిర్వహించనుండగా, అక్టోబర్‌ 17న ర్యాపర్‌ రఫ్తార్‌ ప్రదర్శన, 18 నుంచి 20 వరకు డిస్కో దాండియా కార్యక్రమాలు జరగనున్నాయి.

TV9 Festival of India 2026: ప్రారంభమైన టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి
Tv9 Festival Of India 2026

Updated on: Oct 16, 2026 | 12:04 PM

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం వేదికగా “టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2026” సీజన్-4 ప్రారంభమైంది.. శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.. విజయదశమి, నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహా షష్టి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ దీప ప్రజ్వలనతో ఈ సాంస్కృతిక మహోత్సవానికి అంకురార్పణ జరిగింది. శుక్రవారం నాడు TV9 నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో బరున్ దాస్ ప్రారంభించారు.

తొలిరోజు విశేషాలు – ఆధ్యాత్మికత వివరాలు..

మహా షష్టి దుర్గాపూజ: బెంగాలీ సంప్రదాయబద్ధంగా దేవీ బోధన్, ఆవాహన, అధివాసం క్రతువులతో అమ్మవారికి పూజలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం దివ్యమైన ‘సంధ్యా హారతి’తో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లనుంది.

ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ‘క్రియేటివ్ కార్నర్’లో శంఖ ధ్వనులు, సాంప్రదాయ ఆల్పనా (కోలమ్), రంగవల్లులు, దాండియా స్టిక్ డెకరేషన్ పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

రాత్రి వేళ ప్రముఖ సుఫీ గాయని హర్ష్‌దీప్ కౌర్ నిర్వహించే ప్రత్యక్ష సంగీత కచేరీ (Live Concert) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

అక్టోబర్ 16 నుండి 20 వరకు జరిగే ఈ ఐదు రోజుల వేడుకల్లో భారతీయ సంప్రదాయాలు, వంటకాలు, వినోదాల కలయికగా అనేక కార్యక్రమాలను రూపొందించారు:

అక్టోబర్ 17: ప్రముఖ ర్యాపర్ ‘రఫ్తార్’ తో హై-ఎనర్జీ మ్యూజికల్ నైట్.

అక్టోబర్ 18–20: ఉత్సాహభరితమైన మూడు రోజుల డిస్కో దాండియా రాత్రులు (Dandiya Nights).

గ్లోబల్ ఎగ్జిబిషన్ – కులినరీ షోకేస్: దేశ విదేశాల నుండి వచ్చిన వివిధ రకాల హస్తకళలు, ఫ్యాషన్ ఉత్పత్తులతో పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నోరూరించే విభిన్న వంటకాల స్టాళ్లు ప్రజల కోసం అందుబాటులో ఉన్నాయి.

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు బుక్‌మైషో (BookMyShow) ద్వారా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. పాల్గొనాలంటే నేరుగా బుక్ చేసుకోవచ్చు.. పండుగ వెలుగులతో ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం సరికొత్త వేడుకల శోభను సంతరించుకుంది.

లైవ్ వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us