Viral News: ఇందుకే మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేసింది.. ట్రైన్‌లో మరోసారి పేలిన పవర్ బ్యాంక్

బెంగళూర్‌ నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి ఓ ప్రయాణికుడికి సంబంధించిన పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి ట్రైన్ సీటు మొత్తం మంటలు అంటుకున్నాయి. దీంతో భోగీలోని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. దీంతో ఘటనా స్థాలానిరి చేరుకున్న రైల్వే పోలీసులు మంటలను అదుపు చేశారు.

Viral News: ఇందుకే మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేసింది.. ట్రైన్‌లో మరోసారి పేలిన పవర్ బ్యాంక్
Power Bank Explodes On Bengaluru Chennai Express

Updated on: Oct 31, 2026 | 7:25 AM

ట్రైన్‌లో రాత్రి పూట సెల్‌ఫోన్‌ ఛార్జింగ్ పెట్టడాన్ని రద్దు చేస్తూ రైల్వే శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన రెండ్రోజులకే బెంగళూర్‌-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ పేలుడు సంభవించింది. బెంగళూరును నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రైన్‌లో ఓ ప్రయాణికుడికి సంబంధించిన పవర్ బ్యాంక్ రాత్రి 10.40 సమయంలో పేలిపోయింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి చెన్నై సెంట్రల్‌కు బెంగళూర్‌-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రాత్రి బయల్దేరింది. అయితే ట్రైన్ కృష్ణరాజపురం, బంగారుపేట్టై, కుప్పం, జోలార్పేట్టై దాటి కాట్పాడి స్టేషన్‌ వద్దకు చేరుకోగానే సరిగ్గా 10:40 గంటలకు భారీ శబ్ధం వినించింది. జనరల్ భోగీలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ వ్యక్తి పవర్ బ్యాంక్‌తో తన సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడూ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

పవర్ బ్యాంక్ పేలుడి ధాటికి భారీ మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లోనే సీట్లకు అంటుకున్నాయి. దీంతో ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇక సమాచారం అందుకున్న కాట్పాడి రైల్వే స్టేషన్ పోలీసులు వెంటనే ట్రైన్‌లోకి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించుకొని మంటలను ఆర్పేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us