10 కి.మీ ప్రయాణానికి 45 నిమిషాలు.. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ కలిగిన రెండో నగరం ఇదే!

TomTom traffic index 2025: ఇప్పటికే అత్యధిక ట్రాఫిక్ కలిగిన నగరంగా పేరొందిన భారతదేశ టెక్ రాజధాని బెంగళూరు ఇప్పుడు మరో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. బెంగళూరు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల జాబితాలో రెండో ప్లేస్‌లో నిలిచింది. నెదర్లాండ్‌కు చెందిన టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 2025లో మెక్సికో సిటీ తర్వాత బెంగళూరులోనే అత్యంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు పేర్కొంది.

10 కి.మీ ప్రయాణానికి 45 నిమిషాలు.. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ కలిగిన రెండో నగరం ఇదే!
Tomtom Traffic Index

Updated on: Jan 22, 2026 | 1:19 PM

ఇప్పటికే ట్రాఫిక్‌కు అపఖ్యాతి పాలైన భారతదేశ టెక్ రాజధాని బెంగళూరు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటిగా అవతరించింది. తాజాగా నెదర్లాండ్‌కు చెందిన టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ విడుదల చేసిన రిపోర్ట్‌ ప్రకారం.. మెక్సికో సిటీ 75.9 శాతం ట్రాఫిక్ రద్దీతో ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలవగా బెంగళూరు 74.4 శాతం ట్రాఫిక్‌ రద్దీతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ రద్దీ కలిగిన రెండవ నగరంగా నిలిచిందని పేర్కొంది. అయితే 2014తో పోలిస్తే 2025లో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ 1.7 శాతం పెరిగినట్లు పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే బెంగళూరులోని జనాలు ఎక్కువ సమయం రోడ్లపైనే గడుపుతున్నారని అర్థమవుతుంది.

ట్రాఫిక్‌లోనే ఎక్కువ సమయం

బెంగళూరు ప్రయాణికులకు, నివేదికలోని ముఖ్య గణాంకాలను బట్టి చూస్తే.. 2024లో నగరంలో ట్రాఫిక్ రద్దీ సమయంలో 10 కి.మీ దూరం ప్రయాణించడానికి అరగంట సమయం పడితే 2025కు వచ్చే సరికి 10 కి.మీ ప్రయాణించేందుకు సగటున 36 నిమిషాల 9 సెకన్లు పట్టింది. బెంగళూరులో ఉదయం వేళల్లో ట్రాఫిక్ రద్దీ శాతం 94 శాతంగా ఉంటే అప్పుడు 10 కి.మీ ప్రాణించేందుకు 41 నిమిషాల 6 సెకన్లు పడుతదుంది. అప్పుడు వాహనం సగటు వేగం గంటలకు కవలం 14.6 కి.మీ మాత్రమే ఉంది. ఇక సాయంత్రం సమయాల్లో 115.2 శాతం రద్దీ ఉంటే.. అప్పుడు 10 కి.మీ ప్రయాణిచేందుకు 45 నిమిషాల 27 సెకన్లు పడుతుంది. అప్పుడు వాహనం సగటు వేగం గంటలకు 13.2 కి.మీగా ఉంది. అంటే 15 నిమిషాల్లో కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే ప్రయాణిస్తున్నారు.

ట్రాఫిక్‌ వల్ల 168 గంటలు నష్టం

2025లో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ కారణంగా బెంగళూరు డ్రైవర్లు 168 గంటలు కోల్పోతారని ఇండెక్స్ అంచనా వేసింది, ఇది 7 రోజుల 40 నిమిషాలకు సమానం అని తెలిపింది. 2024 తో పోల్చుకుంటే ఇది 12 గంటల 46 నిమిషాలు ఎక్కువ. బెంగళూరులో అత్యధికంగా ట్రాఫిక్ రద్దీ కలిగిన మే 17,2025ను అత్యంత చెత్తరోజుగా టామ్‌టామ్ పేర్కొంది.

హైదరాబాద్‌ లో ట్రాఫిక్ 

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో సగటున 55.5 శాతం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఈ సమయంలో 18 కిలో మీటర్లు ప్రయాణించేందుకు గంట సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ రద్దీ కారణంగా సుమారు నగర వాసులకు 123 గంటల సమయం వృదా అవుతుంది.

ప్రపంచంలోని అత్యంత ట్రాఫిక్ కలిగిన టాప్-5 నగరాలు

  • మెక్సికో నగరం, మెక్సికో
  • బెంగళూరు, భారతదేశం
  • డబ్లిన్, ఐర్లాండ్
  • లాడ్జ్, పోలాండ్
  • పూణే, భారతదేశం

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ కలిగిన 35 నగరాల్లో 7 ఇండియావే

  • 2 బెంగళూరు – 74.4 శాతం రద్దీ
  • 5 పూణే – 71.1 శాతం
  • 18 ముంబై – 63.2 శాతం
  • 23 న్యూఢిల్లీ – 60.2 శాతం
  • 29 కోల్‌కతా – 58.9 శాతం
  • 30 జైపూర్ – 58.7 శాతం
  • 32 చెన్నై – 58.6 శాతం

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.