Mimi Chakraborty: ఐఏఎస్‌ను అంటూ.. నటి, ఎంపీ మిమి చక్రవర్తినే బోల్తా కొట్టించిన కేటుగాడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

| Edited By: Ravi Kiran

Jun 24, 2021 | 6:22 AM

Fake Covid-19 vaccination camp: ఓ కేటుగాడు.. ఐఏఎస్ అధికారినంటూ.. నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తిని బోల్తాకొట్టించాడు. తాను నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమానికి

Mimi Chakraborty: ఐఏఎస్‌ను అంటూ.. నటి, ఎంపీ మిమి చక్రవర్తినే బోల్తా కొట్టించిన కేటుగాడు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Mimi Chakraborty
Follow us on

Fake Covid-19 vaccination camp: ఓ కేటుగాడు.. ఐఏఎస్ అధికారినంటూ.. నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తిని బోల్తాకొట్టించాడు. తాను నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమానికి హాజరుకావాలని చక్రవర్తిని ఆహ్వానించాడు. దీంతో ఆమె వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ సైతం తీసుకున్నారు. టీకా తీసుకున్న అనంతరం ఆమె ఫోన్‌కు ఎలాంటి మెస్సెజ్ రాకపోవడంతో.. వెంటనే చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ కేటుగాడిని పట్టుకున్నారు. అతడిని దేవాంజన్ దేవ్‌గా పోలీసులు గుర్తించారు. పశ్చిమ్‌ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా సమీపంలో కాస్బా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

కోల్‌కతా కార్పొరేషన్ జాయింట్ కమిషనర్‌నని చెప్పి దేవాంజన్ మిమి చక్రవర్తిని కలిశాడు. ట్రాన్స్ జెండర్ల కోసం కాస్బా ప్రాంతంలో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. హాజరు కావాలని ఆమెను ఒప్పించాడు. దీంతో ఆ కార్యక్రమానికి చక్రవర్తి హాజరై టీకా కూడా వేయించుకున్నారు. టీకా డోసు స్వీకరించగానే.. ఫోన్‌కు మెస్సెజ్ రాలేదు. దీంతోపాటు దేవాంజన్ నుంచి కూడా ఎలాంటి సమాధానం లేకపోవడంతో.. మిమి చక్రవర్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాంజన్‌ను నకిలీ ఐఏఎస్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై మిమి చక్రవర్తి మాట్లాడుతూ.. మంచిపని కావడంతో ఆ ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్లానని తెలిపారు. స్థానికులు ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలనే ఉద్దేశంతో తాను కూడా టీకా తీసుకున్నానని.. తెలిపారు. మెస్సెజ్ రాకపోవడం.. నిందితుడి నుంచి సమాధానం లేకపోవడంతో.. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అయితే.. నిందితుడికి 200 కరోనా వ్యాక్సిన్ వయల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు కూడా ఇలాంటి డ్రైవ్‌లు నిర్వహించాడని.. దానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

Also Read:

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ సమక్షంలోనే పోలీసుల ఘర్షణలు.. …షాక్ తిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Anand Mahindra: ఆటో కరెక్ట్..నెటిజన్లకు గట్టిగా కనెక్ట్..ఆనంద్ మహీంద్రా తాజా ట్వీట్ చూస్తె మీరూ కనెక్ట్ అయిపోతారంతే!