Punjab: ఈళ్లెక్కడి దొంగలురా నాయనా.. హైఓల్టేజ్ కరెంట్ స్తంభాలపైనే కన్నేశారు.. కట్ చేస్తే.. ఏమైందంటే

Punjab: ఈ మధ్య దొంగలు బంగారం, డబ్బు లాంటివి దొంగిలించటం మానేసి ఏకంగా బ్రిడ్జిలను, రైల్ ఇంజన్లను మాయం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి సంఘటనే పంజాబ్ లోని బఠిండా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సారి..

Punjab: ఈళ్లెక్కడి దొంగలురా నాయనా.. హైఓల్టేజ్ కరెంట్ స్తంభాలపైనే కన్నేశారు.. కట్ చేస్తే.. ఏమైందంటే
Punjab Robbery
Follow us

|

Updated on: May 21, 2022 | 6:50 PM

Tower Robbery: ఈ మధ్య దొంగలు బంగారం, డబ్బు లాంటివి దొంగిలించటం మానేసి ఏకంగా బ్రిడ్జిలను, రైల్ ఇంజన్లను మాయం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి సంఘటనే పంజాబ్ లోని బఠిండా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సారి ఏకంగా పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన హైఓల్టేజ్ విద్యుత్ స్తంభాలపైనే వారి కన్ను పడింది. గురువారం వారు చేసిన పనితో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దొంగలు గతంలో బిహార్ రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వంతెనలను ఎత్తుకెళ్లిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దానిని మరువకు ముందే కరెంట్ సరఫరా కోసం నిర్మించే టవర్లను మాయం చేయబోయారు.

పంజాబ్ లోని బఠిండా జిల్లా రాంపుర పూల్ లో 66 కేవీ విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ కారణంగా సుమారు 20 గ్రామాలు కరెంట్ లేక చీకటిలోనే మగ్గుతున్నాయి. దొంగలు టవర్ బోల్టులను తొలగించటంతో అవి కుప్పకూలాయి. విషయం తెలుసుకున్న విద్యుత్తు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు చేరే సరికే దొంగలు పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క అక్కడి విద్యుత్తు అధికారులు కరెంట్ సరఫరాను పునరుద్ధరించేందుకు టవర్ల మరమ్మత్తులు ప్రారంభించారు. టవర్ చోరీ కోసం కొన్ని రోజుల నుంచి దొంగలు అక్కడ ప్రయత్నించినట్లు కనిపిస్తోందని విద్యుత్ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రానికి విద్యుత్తు సరఫరాను తిరిగి పనురుద్ధరించేందుకు రిపేర్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. దీని వల్ల పెను ప్రమాదం తప్పిందని వారు అంటున్నారు. ఐరన్ రేట్లు పెరగటం వల్లనే దొంగలు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్-379 కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.