Trending: రోడ్డుపై నోట్ల వర్షం.. తోసుకుంటూ ఎగబడిన జనం.. మండిపడుతున్న నెటిజన్లు..

|

Feb 19, 2023 | 12:39 PM

డబ్బు అవసరమే.. కానీ అది అధికమైతే.. ఇదిగో ఇలాగే ఉంటుంది. దేశంలో ధనికుల కంటే.. ఒక్కపూట కూడా కడుపునిండా తిండి తినే వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఈ వీడియో చూస్తే మీకు..

Trending: రోడ్డుపై నోట్ల వర్షం.. తోసుకుంటూ ఎగబడిన జనం.. మండిపడుతున్న నెటిజన్లు..
Currency Notes
Follow us on

డబ్బు అవసరమే.. కానీ అది అధికమైతే.. ఇదిగో ఇలాగే ఉంటుంది. దేశంలో ధనికుల కంటే.. ఒక్కపూట కూడా కడుపునిండా తిండి తినే వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఈ వీడియో చూస్తే మీకు ఇలాంటి వాస్తవాలే గుర్తొస్తాయి. ఆ వీధిలో ఉన్నట్టుండి నోట్ల వర్షం కురవడం మొదలైంది. ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం. గాల్లో ఎగిరొస్తున్న నోట్లను అందుకునేందుకు జనం ఎగబడ్డారు. ఇదంతా ఓ కుటుంబం తమ ఆర్భాటం కోసం చేసిన నిర్వాకం. ఓ కుటుంబం తమ కుమారుడి వివాహం సందర్భంగా తమ ఇంటిపైనుంచి కరెన్సీ నోట్లను గాల్లో వెదజల్లింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

మెహ్‌సాణా జిల్లా కడీ తాలుకాలో మాజీ సర్పంచ్‌ కరీంభాయి దాదుభాయి జాదవ్‌ మేనల్లుడి వివాహం సందర్భంగా ఇంటిపైనుంచి 500 రూపాయల నోట్లను గాల్లోకి వెదజల్లారు. గాల్లో కరెన్సీ నోట్లు ఎగిరి రావడం చూసిన ప్రజలు వాటిని అందుకునేందుకు ఎగబడ్డారు. ఈక్రమంలో తోపులాట కూడా జరిగింది. ఆ ఫ్యామిలీలో పెళ్లి కొడుకు ఒక్కడే మగ సంతానం కావడంతో అతని వివాహం సందర్భంగా తమ ఆనందాన్ని ఇలా పంచుకున్నారని తెలుస్తోంది. వారు అలా బిల్డింగ్‌ పైనుంచి నోట్లు వెదజల్లుతున్న దృష్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అవికాస్తా నెట్టింట చేరడంతో వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకరి ఆనందం మరొకరికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదని, ఆ కుటుంబం నోట్లను అలా వెదజల్లేకంటే పేదవారికి పిలిచి పంచి ఉంటే ఎంతో హుందాగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..