పాత వీడియో చూసి అయ్యో పాపం అనుకున్నారు.. కొత్త వీడియో చూస్తే అసలు బాగోతం తెలిసింది

పాత వీడియో చూసి అయ్యో పాపం అనుకున్నారు.. కొత్త వీడియో చూస్తే అసలు బాగోతం తెలిసింది
Caste Fight

తమిళనాడు కోయంబత్తూర్‌లో ఓ ఉద్యోగి మరో ఉద్యోగి కాళ్లు పట్టుకున్న సీన్‌ ఇది. పెద్దాయన తనకంటే చిన్న వయసున్న వ్యక్తి కాళ్లు...

Ram Naramaneni

|

Aug 15, 2021 | 7:15 PM

తమిళనాడు కోయంబత్తూర్‌లో ఓ ఉద్యోగి మరో ఉద్యోగి కాళ్లు పట్టుకున్న సీన్‌ ఇది. పెద్దాయన తనకంటే చిన్న వయసున్న వ్యక్తి కాళ్లు పట్టుకున్నాడు.. చేతులెత్తి మొక్కాడు. కొద్దిరోజుల క్రితం ఈ వీడియో వైరల్ అయింది. చూసిన వాళ్లంతా ముత్తుస్వామిపై జాలి, కరుణ చూపించారు. కాళ్లు పట్టించుకున్న వ్యక్తిపై కన్నెర్రజేశారు. కానీ ఇదంతా తూచ్‌… ఒట్టి డ్రామా.. దీని వెనుక అసలు నిజం రివీల్ అయింది. ముత్తుస్వామి కట్టుకథా చిత్రమ్ బట్టబయలైంది.

చేసిందంతా చేసి సెంటిమెంట్‌ తెగ పండించాడు ముత్తుస్వామి. సహోద్యోగి చెంప చెల్లుమనిపించాడు. పరుష పదజాలంతో ధూషించాడు. పెద్దరికాన్ని పోగొట్టుకున్నాడు. పైగా తనపై అనుమానం రాకుండా ఉండేలా కాళ్లు పట్టుకుని సీన్‌ రక్తి కట్టించాడు ముత్తు స్వామి. కాళ్లు పట్టుకునే వీడియో మాత్రమే రిలీజ్ చేసి సింపతి కొట్టేశాడు. కానీ ఇప్పుడు చెంప చెల్లుమనిపించే వీడియో బయటికొచ్చింది. ముత్తు స్వామి ఫైర్ బ్రాండ్‌ చిత్రమ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు.

పాత వీడియో చూసిన చాలామంది అగ్రవర్ణాలు-దళితులు అనే ట్యాగ్ లైన్ తగిలించి నానా యాగి చేశారు. దళితులంటే చిన్నచూపు సరికాదని మండిపడ్డారు. కానీ ఇప్పుడు తెరవెనుక చిత్రమ్ బయటపడింది. ముత్తుస్వామి చేసిన నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దాయన అయి ఉండి ఇలా చేయడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read: తెలంగాణ రైతులకు అలెర్ట్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ

దారుణం.. క్రూరం.. పశువులపై అత్యాచారం.. వాడు అలా.. వీడు ఇలా

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu