Student Death: అక్కడి అమ్మాయిలకు ఏమైంది.. రెండు వారాల్లోనే ముగ్గురు సూసైడ్‌.. ఆందోళనలో తల్లిదండ్రులు, ప్రభుత్వం

|

Jul 26, 2022 | 3:43 PM

అయితే, టీనేజీ విద్యార్థుల మరణాలతో ఆందోళనకు గురైన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల, కాలేజ్ విద్యార్థులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అందించేందుకు 800 మంది వైద్యులను నియమించాలని నిర్ణయించింది.

Student Death: అక్కడి అమ్మాయిలకు ఏమైంది.. రెండు వారాల్లోనే ముగ్గురు సూసైడ్‌.. ఆందోళనలో తల్లిదండ్రులు, ప్రభుత్వం
crime news
Follow us on

Student Death: త‌మిళ‌నాడులో మ‌రో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కల్లకురిచ్చిలో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు రేకిత్తించినవిద్యార్థి మృతి ఘ‌ట‌న మ‌ర‌వ‌కముందే అదే రాష్ట్రంలోని తిరువళ్లూరులో 12వ తరగతి చదువుతున్న మరో బాలిక మృతి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన దాదాపు 24 గంటల తర్వాత కడలూరు జిల్లాలో మరో విద్యార్థిని శవమై కనిపించింది. కేవలం 2 వారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. తల్లి మందలించడంతో బాలిక మనస్తాపానికి గురైనట్లు సమాచారం. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. సోమవారం తెల్లవారుజామున, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంస్థ ఆధ్వర్యంలోని హాస్టల్ ఆవరణలో శవమై కనిపించింది. ఆమె హాస్టల్‌ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం సత్య ప్రియ వెల్లడించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్-సీఐడీ (సీబీసీఐడీ)కి బదిలీ చేసినట్లు ఆమె తెలిపారు.

జూలై 13న, కల్లకురిచి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని చనిపోయింది. ఆమె మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, మృతురాలి బంధువులు, స్థానిక ప్రజలు నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె మృతిపై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ బాలిక చదువుతున్న ప్రైవేట్ పాఠశాలను బంధువులు ధ్వంసం చేశారు. వీధుల్లోకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెలిపారు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఉన్న బ‌స్సుల‌ను, ఓ పోలీసు వాహ‌నాన్ని త‌గులబెట్టారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింద‌. ఈ హింసాత్మక నిరసనల సమయంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో సుమారు 52 మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. కొందరు దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. చివరకు వ్యవహారం కోర్టుకు చేరింది.

అయితే, టీనేజీ విద్యార్థుల మరణాలతో ఆందోళనకు గురైన తమిళనాడు ప్రభుత్వం ‘మనవర్ మనసు’ పథకం కింద పాఠశాల విద్యార్థులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అందించేందుకు 800 మంది వైద్యులను నియమించాలని నిర్ణయించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళి మాట్లాడుతూ, కౌమారదశలో సమస్యలు, చదువుల ఒత్తిడి, తోటివారి ఒత్తిడి, పిల్లల ప్రవర్తనాపరమైన మార్పులకు సంబంధించిన ఇతర సమస్యల మధ్య విద్యార్థులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి