మెడిసిన్‌ ధరల అమ్మకం వ్యత్యాసాలపై సుప్రీంకోర్టు సీరియస్‌

మెడిసిన్‌ ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. MRPకి, రిటైలర్లు కొనుగోలు చేసే ధరలకు భారీ వ్యత్యాసం ఉండటంపై తీవ్రంగా ఫైర్‌ అయింది. మందుల కంపెనీల కోసమే వ్యవస్థ మొత్తం పనిచేస్తోందా అంటూ సుప్రీంకోర్టు నిలదీసింది. మందుల ధరల నియంత్రణ, ట్రేడ్‌ మార్జిన్ల పరిమితులపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది.

మెడిసిన్‌ ధరల అమ్మకం వ్యత్యాసాలపై సుప్రీంకోర్టు సీరియస్‌
Supreme Court

Updated on: Oct 27, 2026 | 8:59 PM

క్యాన్సర్ మందుల ధరలపై ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మసీలు విధిస్తున్న భారీ లాభాల మార్జిన్లను.. పట్టపగలు చేస్తున్న దోపిడిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అడ్డగోలు ధరల పెంపును నరమేధంగా భావించింది. మందుల ధరలు, ట్రేడ్‌ మార్జిన్లపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం…కేంద్రప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. మందుల కొనుగోలు ధరకు, రోగులకు విక్రయించే ధరకు ఉన్న వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. రూ. 11వేలకు లభించే మందును రూ. లక్షా 30వేలకు విక్రయించడాన్ని సర్దుబాటుగా ఎలా పరిగణిస్తారని నిలదీసింది. ధరల పెరుగుదలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన వివరణలు అంతగా సంతృప్తి కరంగా లేవని అభిప్రాయపడింది. రిటైలర్లు రూ. 15కు కొనుగోలు చేసే డ్రిప్‌లైన్‌ను రూ. 250కు విక్రయించడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఇంతటి భారీ వ్యత్యాసాలు కొనసాగుతుంటే.. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వుల ఉద్దేశం ఏమైపోయిందని ప్రశ్నించింది.

ధరల నియంత్రణ సంస్థ పనితీరు పూర్తిగా నిర్వీర్యమైనట్టుగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించగా.. కేంద్రం తరపున అదనపు సొలిటిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ ధరలకే లభిస్తున్నాయని ఐశ్వర్య భాటి చెప్పేయత్నం చేయగా.. ఆదాయం తక్కువ ఉన్న దేశాలతో ఇక్కడి ధరలను పోల్చి చూడలేమన్నారు. రోగుల ప్రయోజనాల కంటే వ్యాపార ప్రయోజనాలను ముందు ఉంచకూడదని సుప్రీంకోర్టు గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది. ధరల వ్యత్యాసాన్ని చూపుతూ.. ఔషధ తయారీదారుల ప్రయోజనాల కోసమే వ్యవస్థ పనిచేస్తోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ధరల వ్యత్యాసాన్ని ఇలాగే నియంత్రణ లేకుండా కొనసాగనివ్వాలా అని నిలదీసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us