South Central Railway: రైల్వే ప్రయాణికులు అలర్ట్‌.. అక్టోబర్‌ 1 నుంచి రైలు ప్రయాణాల్లో భారీ మార్పులు

|

Oct 01, 2021 | 5:38 AM

South Central Railway: రైలు ప్రయాణం చేసేవారు ఈ విషయాలను తప్పకుండా గమనించాలి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అక్టోబర్ 1 నుంచి రైళ్ల రాకపోకలకు..

South Central Railway: రైల్వే ప్రయాణికులు అలర్ట్‌.. అక్టోబర్‌ 1 నుంచి రైలు ప్రయాణాల్లో భారీ మార్పులు
South Central Railway
Follow us on

South Central Railway: రైలు ప్రయాణం చేసేవారు ఈ విషయాలను తప్పకుండా గమనించాలి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అక్టోబర్ 1 నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి కీలక మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా కొన్ని మెయిల్,ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌పాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా, అలాగే కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అంతేకాకుండా పలు రైళ్ల దారి మళ్లించడం, వేగం పెంచడం, టెర్మినల్స్‌లో మార్పులు కూడా చేసింది. ఈ మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు అక్టోబర్ 1 నుంచి మారిన టైమ్ టైబుల్‌కు అనుగుణంగా.. ప్రయాణించాల్సిన ట్రైన్స్ సమయాలను తెలుసుకోవాలని సూచించింది.

IRCTC వెబ్‌సైట్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES), సంబంధిత రైల్వే స్టేషన్ల స్టేషన్ మేనేజర్ / ఎంక్వయిరీ కౌంటర్‌ని సంప్రదించడం ద్వారా రైళ్లకు సంబంధించిన సమాచారం, సమయాల్లో మార్పుల గురించి తెలుసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే తె లిపింది. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 872 రైళ్లు నడుస్తుండగా, 673 ట్రైన్స్ స్పీడ్ పెంచినట్టుగా తెలిపింది.

సూపర్‌పాస్ట్‌గా మారనున్న రైళ్ల వివరాలు(కొత్త ట్రైన్ నెంబర్స్):

1. సికింద్రాబాద్ – మణుగూరు ఎక్స్‌ప్రెస్ (02745/02746)
2. నర్సాపూర్ – నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (02713/02714)
3. కాచిగూడ – మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (02777/02778)
4. సికింద్రాబాద్ – రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (02755/02756)
5. కాకినాడ టౌన్ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (02699/02700)
6. సికింద్రాబాద్ – హైసర్ ఎక్స్‌ప్రెస్ (02789/02790)

ఎక్స్‌ప్రెస్‌గా మారనున్న ప్యాసింజర్ రైళ్లు.. పాత నెంబర్- కొత్త నెంబర్:

1. 57121-పాత ట్రైన్‌ నెంబర్‌)- కాజీపేట్-సిర్పూర్ టౌన్ (07272- కొత్త ట్రైన్‌ నెంబర్‌)
2. 57122- సిర్పూర్ టౌన్ – కాజీపేట్ (07271)
3. 57123- భద్రాచలం రోడ్ – సిర్పూర్ టౌన్ (07260)
4. 57124- సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్ (07259)
5. 57381- గుంటూర్- నర్సాపూర్ (07267)
6. 57382- నర్సాపూర్- గుంటూర్ (07268)
7. 57547- హైదరాబాద్ డెక్కన్- పూర్ణా (07653)
8. 57548- పూర్ణా- హైదరాబాద్ డెక్కన్ (07654)
9. 57549- హైదరాబాద్ డెక్కన్ – ఔరంగబాద్ (07049)
10. 57550- ఔరంగబాద్- హైదరాబాద్ డెక్కన్ (07050)
11. 57563- నాందేడ్- తాండూర్ (07691)
12. 57564 – తాండూర్- నాందేడ్ (07692)
13. 67241 – విజయవాడ – కాకినాడ పోర్ట్ (07273)
14. 67242 -కాకినాడ పోర్ట్- విజయవాడ (07264)
15. 67243 – కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (07265)
16. 67244 – విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (07266)
17. 67297 -గుడూరు – విజయవాడ (07261)
18. 67298- విజయవాడ -గుడూరు (07262)
19. 77281 – గుంటూరు – కాచిగూడ (07269)
20. 77282 -కాచిగూడ- గుంటూరు (07270)
21. 77693 – కాచిగూడ -రాయిచూర్ (07797)
22. 77694- రాయిచూర్ – కాచిగూడ (07798)

టర్మినల్ మార్పులు:

పాత ట్రైన్ నెంబర్(రూట్) – కొత్త ట్రైన్ నెంబర్- (ఈ స్టేషన్స్ మధ్య రద్దు చేయబడింది)

► 67237(తిరుపతి- గుడూరు) – 07667- (తిరుపతి-రేణిగుంట)

► 67239(గుడూరు-తిరుపతి) – 07666- (రేణిగుంట- తిరుపతి)

► 17320/17319(సికింద్రాబాద్-హుబ్లీ) – 07320/07319- (సికింద్రాబాద్-హైదరాబాద్)

► 17233/17234 (సికింద్రాబాద్- బల్లార్షా) – 07233/07234 – (బల్లార్షా- సిర్పూర్ కాగజ్‌నగర్)

► 57121(కాజిపేట్-బల్లార్షా) – 07272- (బల్లార్షా- సిర్పూర్ టౌన్)

► 57124 (బల్లార్షా-భద్రాచలం) – 07271- (బల్లార్షా-సిర్పూర్ టౌన్)

ట్రైన్స్ డైవర్షన్:

► 02513/02514 – సికింద్రాబాద్ – గౌహతి – సికింద్రాబాద్ (వీక్లీ) – ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట- విజయవాడ-దువ్వాడ మార్గంలో ప్రయాణిస్తుండగా.. ఇక నుంచి సికింద్రాబాద్- పడిగిపల్లి-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్లనుంది.

► 02203/02204- సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ (ట్రై వీక్లీ)- ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్తుండగా.. ఇక నుంచి సికింద్రాబాద్-పగిడిపల్లి-విజయవాడ-దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది.

► 02784/02783 సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్(వీక్లీ).. ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట్-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్తుంగా.. ఇక నుంచి సికింద్రాబాద్-పగిడిపల్లి-విజయవాడ-దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది. (కాజీపేట, వరంగల్, ఖమ్మంలలో స్టాపింగ్‌ను తీసేశారు)

► 08562/08561- కాచీగూడ- విశాఖపట్నం- కాచీగూడ(డైలీ).. ప్రస్తుతం సికింద్రాబాద్-కాజీపేట్-విజయవాడ-దువ్వాడ మార్గంలో వెళ్తుంగా.. ఇక నుంచి సికింద్రాబాద్-కాజీపేట-రాయన్‌పాడ్(బల్బు)-దువ్వాడ మార్గంలో ప్రయాణించనుంది. (విజయవాడ స్టాపింగ్‌ను తీసేశారు)

► 01301/01302- సీఎస్‌టీ ముంబై- కేఎస్ఆర్ బెంగళూరు- సీఎస్‌టీ ముంబై (డైలీ).. ప్రస్తుతం వాడి-గుంతకల్- గూటీ- కల్లూరు- ధర్మవరం మీదుగా రాకపోకలు సాగిస్తుండగా.. ఇక నుంచి వాడి-గుంతకల్- గంగరాయపల్లే- కల్లూరు- ధర్మవరం మీదుగా రాకపోకలు సాగించనుంది. (గూటీ స్టాపింగ్‌ను తీసేశారు)

ఇవీ కూడా చదవండి:

ATM Cash: ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదా? ఇక నుంచి అలాంటిదేమి ఉండదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు

Mega Comet: దూసుకువస్తోన్న భారీ తోకచుక్క.. భూమిని ఢీకొట్టనుందా..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?