నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యం.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చిన వైద్యులు

|

Jan 30, 2021 | 6:59 AM

ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స అనంతరం సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యం.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చిన వైద్యులు
Sourav Ganguly
Follow us on

Ganguly’s health stable : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. శుక్రవారం గంగూలీని ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారమని వైద్యులు తెలిపారు. కాగా, ఛాతీలో నొప్పిగా ఉందని రెండ్రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన గంగూలీకి గుండెలోని రెండు ధమనుల్లో పూడికలు ఉండడంతో గురువారం.. రెండు స్టెంట్‌లు వేసిన సంగతి తెలిసిందే. గంగూలీ కోలుకుంటున్నట్లు అతనికి శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు అఫ్తాబ్‌ ఖాన్‌, అశ్విన్‌ మెహతా తెలిపారు.

ఇదిలావుంటే, ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న గంగూలీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులతో ఆరా తీశారు.