Telugu News India News School Holidays In March 2025: Good news for students.. Check Complete List Here
School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మార్చిలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
School Holidays: హోలీ పండగ నుంచి ఉగాది, అలాగే జమాత్ ఉల్-విదా, ఈద్-ఉల్-ఫితర్ వరకు ఈ నెల సంప్రదాయాలతో కూడా పండగలు ఉన్నాయి. ఈ పండగల సమయాల్లో విద్యార్థులకు పండగే. ఎందుకంటే మార్చి నెలలో చాలా రోజుల పాటు ఆదివారాలు కాకుండా ఇతర వారాల్లో సెలవులు వస్తున్నాయి.
వసంతకాలం వస్తున్నందున మార్చి 2025 భారతదేశం అంతటా జరుపుకునే ముఖ్యమైన పండుగల కారణంగా అనేక సెలవులను వస్తున్నాయి. ఫిబ్రవరి 2025లో ముఖ్యమైన పండుగలు, కార్యక్రమాలకు కొన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయి. హోలీ పండగ నుంచి ఉగాది, అలాగే జమాత్ ఉల్-విదా, ఈద్-ఉల్-ఫితర్ వరకు ఈ నెల సంప్రదాయాలతో కూడా పండగలు ఉన్నాయి. ఈ పండగల సమయాల్లో విద్యార్థులకు పండగే. ఎందుకంటే మార్చి నెలలో చాలా రోజుల పాటు ఆదివారాలు కాకుండా ఇతర వారాల్లో సెలవులు వస్తున్నాయి.
మార్చి 2025 లో పాఠశాల సెలవుల జాబితా:
మార్చి 13: హోలికా దాహన్: చోటీ హోలీ అని కూడా పిలిచే హోలికా దహన్ మార్చి 13 గురువారం రాత్రి జరుపుకుంటారు. ఇది హోలీ పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక్కడ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకొంటారు.
మార్చి 14: హోలీ: హోలీ అనేది లక్షలాది మంది జరుపుకునే ప్రధాన భారతీయ పండుగ. ఇది రంగులు ఒకరికొకరు చల్లుకునే పండగ. ఈ పండగ రోజు రకరకాల రంగులతో, రంగుల నీళ్లను చల్లుకుంటూ వైభవంగా జరుపుకొంటారు.
మార్చి 28: జమాత్ ఉల్-విదా: ఈ సంవత్సరం మార్చి 28న జమాత్ ఉల్-విదా పండుగ వస్తుంది. రంజాన్ చివరి శుక్రవారం నాడు జరుపుకునే ఈ పండుగ ప్రార్థనలు, ఖురాన్ పారాయణం, దానధర్మాల ద్వారా జరుపుకుంటారు.
మార్చి 30: ఉగాది: మరాఠీ, కొంకణి హిందువులకు గుడి పడ్వా కొత్త సంవత్సరం ప్రారంభం. హిందూ క్యాలెండర్‌లో చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే ఇది వసంతకాలం రాకను సూచిస్తుంది.ఉగాది అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం. దీనిని యుగాది అని కూడా పిలుస్తారు. దీనిని పూల అలంకరణలు, ఆచారాలు, పండుగ భోజనాలతో జరుపుకుంటారు.
మార్చి 31: ఈద్-ఉల్-ఫితర్: ఈద్-ఉల్-ఫితర్ అనేది రంజాన్ ముగింపును సూచించే ఒక ముఖ్యమైన ఇస్లామిక్ పండుగ. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్‌లోని 10వ నెల అయిన షవ్వాల్ మొదటి రోజున జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకొంటారు. భారతదేశంలో ఈద్-ఉల్-ఫితర్ మార్చి 31న జరుపుకుంటారు.